సాక్షి, మంచిర్యాల : చెట్టమ్మా చెట్టమ్మా చెట్టమ్మా...నీపుట్టుక ఎంత గొప్పమ్మా.. నీవు లేని లోకాన్ని ఊహించలేనమ్మా.. మానవ మనుగడకే నీవు తొలి మెట్టమ్మా అంటూ ఎండను ఎదురినిచ్చి.. నీడనీచ్చే.. విషవాయువులు మింగి ప్రాణవా యువు నిచ్చే చెట్టు విశిష్టతపై తన గానంతో చక్కగా ఆలపిం చారు. బడి బయట ఏముందిరా.. బడిలో భవిత ఉంది..రా..బడిలో ఆట ఉందిరా.. చిన్నా బడిలోనూ పాట ఉంది రా.. బడిలో చదువు కో.. అంటూ పాడిన పాట ఆలోచింపజేస్తోంది.
ఇలా బస్టాండ్, రైల్వేస్టేషన్ యాచకవృత్తి కొనసాగిస్తూ విలువైన బాల్యాన్ని కొల్పోతున్న చిన్నారులపై ఆమె పాడిన పాటలు మంత్రముద్ధులన్ని చేస్తాయి. గురువుగా పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించటం ఆమె వృత్తి.. పాటలు పాడడం ప్రవృత్తి. అందులోనూ అనువాద గానంతో దిట్టగా రాణిస్తున్న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద.
చిన్ననాటి నుంచి మక్కువ...
చిన్ననాటి నుంచే శారదకు పాటలంటే ఇష్టం..అమ్మమ్మ రెడియో ఫ్యాన్స్ కావటం.. అనుకరణ పాటలు పాడటంతో శారద పై ప్రభావం పడింది. పాఠశాలల, కళాశాలల స్థాయిలో ఎన్నో పాటలు పాడటం.. ప్రశంసలు అందుకున్నారు. ఇంటికి వెళ్లితే చాలు పొలం పనుల్లో కష్టాలు తెలియకుండా వాళ్ల అమ్మ లక్ష్మీ పాటలు కూడా ప్రభావితం చేశాయి. అప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నప్పటికి తీరిక సమయంలో ఏదో ఒక గానం చేస్తూ వచ్చారు.
కొంత కాలం ఓ గురువు వద్ద కూడా సంగీతంపై నైపుణ్యాన్ని పొందారు. ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూనే కాలక్షేపం కోసం ఆలపించే పాటలు విన్నా తోటి టీచర్‌ల సలహ మేరకు స్మయిల్ అనే యాప్‌లో సభ్యత్వం పొందారు. దాదా పు 800 పాటలు పాడారు. ఇందులో పేర్కొందిన సింగర్‌తో కలిసితో శారద గానం అలపించారు. ఇప్పటికే వాట్సప్‌లో ఆమె పాడిన పాటలు మారుమోగుతుంటాయి.
స్వరాంజలి మ్యూజిక్ ఆకాడమికి చెందిన వెంకటేశ్ స్వరకల్పన, సంగీతం, రచనలో బడి బయట ఎముందిరా అనే పాటలతో పాటు, చెట్టమ్మా పాటలు ఆడియో పూర్తయ్యాయి. ఇది విన్న వారంతా కొన్ని దృశ్యాలు జతచేసి వీడియో రూపంలో తీసుకువస్తే బాగుంటుందని సూచన మేరకు ఆలోచన చేసింది. ప్రసుత్తం వీడియో చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఇందులో ఆమె గానంతో పాటు నటిస్తుండటం విశేషం. త్వరలో వీడియో క్యాసెట్లను ఆవిష్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment