
పేదలకు అందని ప్రభుత్వ వైద్యం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ఎంజీఎం ఆస్పత్రిలో టీడీపీ ఒక ్క రోజు దీక్ష
ఎంజీఎం : నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కు అరుున ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయూలని టీడీపీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మానవ వనరులను వినియోగించుకోవడం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీనికి ఎంజీఎం ఆస్పత్రిలో సగానికిపైగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులే నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ రెండేళ్ల పాలనలో ఒక్క డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో ఫిజిషియన్, గ్యాస్ట్రో వంటి వైద్యుల లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
152 డాక్టర్లు కావల్సి ఉండగా 73 స్థానాలు ఖాళీగానే ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు రూ. 800 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేయడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రుల పరిస్థితి ఈ విధంగా ఉంటే పీహెచ్‌సీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందన్నారు. టీడీపీ మిషన్ కాకతీయ వ్యతిరేకం కాదని.. మిషన్ కాకతీయలో జరిగే అవినీతికి వ్యతిరేకమన్నారు. అంతేకాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కాంట్రాక్టర్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని కలెక్టర్ కరుణ పేర్కొన్నారని తెలిపారు. రెండు నెలల్లో వైద్య పోస్టుల నియూమకాలతో పాటు రోగులకు మెరుగైనా సేవలందించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, నాయకులు ఈగ మల్లే శం, అశోక్‌కుమార్, గన్నోజు శ్రీనివాస్, జాటో తు ఇంద్ర, హుస్సేన్, శ్రీరాముల సురేష్, హు స్సెన్, నరేందర్, వీరస్వామి పాల్గొన్నారు.