కామారెడ్డి (నిజామాబాద్): కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కుటుంబ పాలన చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారితే, టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలను వంచిస్తోందని విమర్శించారు.
రైతులను వంచిస్తున్న వారిపై పోరాడుతాం
రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఆరోపించారు. అక్కడ రాజధాని పేరుతో రైతుల భూములను లాక్కొంటూ మోసగిస్తున్నారని తెలిపారు. ఇక్కడ బంగారు తెలంగాణ పేరు తో రైతాంగాన్ని వంచిస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండి పోరాడుతామన్నారు.
చంద్రబాబుది బందిపోటు పాలన
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రై వేటుపరం చేసి బందిపోటు పాలన సాగించారని పార్టీ సీజీసీ మెంబర్ నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. బాబు పాలనలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక రైతులకు మేలు జరిగిందని, ఆయన చనిపోయాక తిరిగి రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. వైఎస్ జగన్ రైతుల పక్షాన పోరాడుతున్నారని, అం దులో భాగంగానే పొంగులేటి దీక్ష అని తెలిపారు.
రైతు కుటుంబాలను ఆదుకున్నది వైఎస్సారే
‘దేశం’ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకున్నది దివంగత వైఎస్సారేనని మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. విద్యుత్తు బకాయలు, రుణాలను మాఫీ చేసి రైతులకు వైఎస్సార్ ఎంతో మేలు చేస్తే, ఇప్పటి పాలకులు అన్ని రకాల పన్నులు పెంచుతూ మోయలేని భారం మోపుతు న్నారని ఆరోపించారు.
రైతు సమస్యలపై పోరాడుతాం..
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో రైతుదీక్ష వేదికపై ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టిందని చెప్పారు.
రైతులను వంచిస్తున్న ప్రభుత్వం
Published Mon, May 11 2015 2:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement