రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
► సమస్య పరిష్కారానికి పోరాడుతాం
► తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
► రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ కల్పించాలి : జస్టిస్ చంద్రకుమార్
► వరంగల్ మార్కెట్‌లో రైతులతో మాటామంతీ
► రైతు సంక్షేమం పట్టించుకోవాలి జస్టిస్ చంద్రకుమార్
వరంగల్ సిటీ : తీవ్ర వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ జేఏ సీ చైర్మన్‌ప్రొఫెసర్ కోదండరాం కోరారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ గేట్ సమీపంలో గురువారం తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మార్త రాజయ్య అధ్యక్షతన గురువారం రైతు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ మేరకు తొలుత కోదండరాం మార్కెట్‌ను సందర్శించారు. మిర్చి, పసుపు, పల్లి,పత్తి, మక్కల యూర్డులను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. పంట దిగుబడి, అందుతున్న ధరపై ఆరా తీయగా.. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గగా, మిర్చి యూర్డులో దళారుల బెడద ఉందని రైతులు వాపోయూరు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కరువు, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. వారికి న్యాయం చేసేంత వరకు పోరాడుతామని కోదండరాం తెలిపారు.
ప్రోత్సాహకాలు, సబ్సిడీ కల్పించాలి
పంటలు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి ప్రో త్సాహకాలు, సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ రైతు జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బ తింటే ఆదుకోవాలని కోరారు. సదస్సులో ఉత్తమ రైతు అవార్డు గ్రహీతలు బచ్చు వీరారెడ్డి, వి.వెంకటేశ్వర్‌రావు, ప్రతినిధులు అర్షం స్వామి, రాజు, ఈశ్వర్ పాల్గొన్నారు.