గవర్నర్‌ తీరు దుర్మార్గం: రేవంత్‌రెడ్డి | Governor nature of the depravity: Revanth Reddy | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ తీరు దుర్మార్గం: రేవంత్‌రెడ్డి

Published Thu, Dec 29 2016 2:43 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

గవర్నర్‌ తీరు దుర్మార్గం: రేవంత్‌రెడ్డి - Sakshi

గవర్నర్‌ తీరు దుర్మార్గం: రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు అప్రజా స్వామికంగా, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని టీటీడీ ఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి, రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని పక్షాలు పాల్గొంటే ఎంత గౌరవంగా, మర్యాదగా ఉంటుందో గవర్నర్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

విందుకు ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టుగా గవర్నర్‌ విన్నట్లు కనబడుతున్నదని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలతో సమానంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే సంప్రదాయాన్ని గవర్నర్‌ పాటించకపోవడం దుర్మార్గమని, తమ పార్టీని పిలవకపోవడం సరికాదని రేవంత్‌రెడ్డి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement