మోత్కుపల్లికి గవర్నర్ గిరీ!
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకదానికి నియమించే అవకాశం
హైదరాబాద్: టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైంది. ఆయనను త్వ రలోనే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, జాతీయస్థాయిలో టీడీపీ నేతలకు పదవులు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి.
అందులో భాగంగానే ఈ పదవుల పంపకం జరుగుతోంది. గతంలో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ పదవుల నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమించనున్నారు.
ట్రైఫెడ్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్
గిరిజన సహకార మా ర్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నియమితులు కానున్నారు. ఆయనను ట్రైఫెడ్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రం సమ్మతించింది.