యజమానికి జరిమానా విధించిన రశీదు
సాక్షి, కామారెడ్డి: హరితహారంలో నాటిన మొక్కలను మేపినందుకు ఎడ్ల యజమానికి జరిమానా విధించిన సంఘటన మండలంలోని ఉగ్రవాయిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లంబాడి శంకర్‌కు చెందిన రెండు ఎడ్లు క్యాసంపల్లి తండా శివారులోని రైస్ మిల్ సమీపంలో కమ్యూనిటీ స్థలంలో హరితహారంలో నాటిన మొక్కలను మేశాయి. దీన్ని చూసిన గ్రామ కారోబార్ జీపీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. కార్యదర్శి జరిమానా విధించాలని పేర్కొనడంతో కారోబార్ హరితహారంలో ఎడ్లు మేసిన మొక్కలను పరిశీలించారు.
జీపీ సిబ్బందితో ఎడ్ల యజమాని లంబాడి శంకర్‌ను పిలిపించి రూ.1000 జరిమాన విధించారు. హరితహారంలో నాటిన మొక్కలను ఎవరూ మేపినా జరిమానాలు తప్పవని గ్రామ కార్యదర్శి పేర్కొన్నారు. మరోవైపు, పశువులు మొక్కలు తిన్నాయని రైతులకు జరిమానాలు వేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్‌లు సైతం నిరసన తెలుపుతున్నారు. గొర్రెల కాపర్లకు ప్రభుత్వం సహాయం అందజేస్తూ జరిమానాలు వేయడంపై కుర్మ గొల్లలు నిరసన తెలిపారు. పరిస్థితి ఇలాగా ఉంటే ఉద్యమం తప్పదని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment