కార్యక్రమంలో మాట్లాడుతున్న బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు
మిర్యాలగూడ రూరల్ : గురుకుల పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లా ఆదరించాలని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు సూచించారు. బుధవారం మిర్యాలగూడ మండలంంలోని శ్రీనివాసనగర్ గల బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లు, డేటా ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తల్లిదండ్రులను వదిలి గురుకులాలకు వచ్చిన విద్యార్థులకు కొంత బెరుకు, భయం ఉంటుందని, వారికి కా వాల్సినవన్నీ సమకూర్చడంతో పాటు పాఠశాలను తన ఇల్లుగా నమ్మకం కలిగించాలని సూ చించారు. అప్పుడే వారు ఇష్టంగా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తారని చెప్పారు.
అనంతరం పాఠశాలలో నీటి కొరత ఉన్న విషయం తెలుసుకున్న ఆయన తాగునీరు అందించే బోరును పరిశీలించారు. అదనంగా మరో బోరు వేసి సమస్య తీర్చాలని ప్రిన్సిపాల్ వెంకటప్పయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ గురుకుల ప్రిన్సి పాల్ భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, కత్తుల శంకర్, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
‘కార్పొరేట్’కు దీటుగా బీసీ గురుకులాలు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ గురుకులాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాణిస్తున్నాయని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు అన్నారు. బుధవారం శ్రీనవాసనగర్‌లో గల గురుకుల పాఠశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రవేశపెట్టిన 30 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందకు ప్రభుత్వం స్థలం కేటాయిం చిందన్నారు.
12 పాత పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించేందుకు ఒక్కొ క్క పాఠశాలకు 10 ఎకరాల స్థలం కేటాయించిందని చెప్పారు. ఒక్కొ క్క పాఠశాల భవనానికి రూ.20కోట్ల చొప్పున రూ.240 కోట్లు నిధులు ప్ర భుత్వం విడుదల చేసిందని తెలిపారు. గత సంవత్సరం తాత్కాలిక బోధన సిబ్బంది స్థానంలో కొత్తగా 2000 మంది బోధనా సిబ్బందిని నియమించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
మరో 800 మంది బోధనేతర సిబ్బంది (క్రాఫ్ట్, డ్రాయింగ్, పీఈ టీ)ని త్వరలో నియమించనున్న ట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు డిజిటల్ క్లాసులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఇప్పటికే పాఠశాలలకు ఫర్నిచర్ అందజేశామని, ఈ సంవత్సరం సైన్స్ ల్యాబ్, గ్రంథాలయాలు ఏ ర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ గురుకుల బోధనపై తల్లి దండ్రులకు నమ్మకం పెరిగిందని తెలి పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ గురకులాల రీజినల్ కోఆర్డినేటర్ ఎం.షకీనా, ప్రిన్సి పాల్స్ వెంకటప్పయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment