నల్గొండ: పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చెల్లదని హైకోర్టు ఆదేశించిన సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించడం తగదని ఆయన టీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు.
రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో కిసాన్ సందేశ్ యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. దాంతో గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా స్పందించారు.