సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2018కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీల ద్వారా ఎంపికైన యాత్రికులు హైదరాబాద్ నుంచే మక్కాకు బయలుదేరనున్నట్లు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్, ప్రత్యేక అధికారి ఎస్‌ఎ.షుకూర్ తెలిపారు. సోమవారం నాంపల్లి హజ్‌హౌస్‌లో ఇరు రాష్ట్రాల హజ్ కమిటీల చైర్మన్లు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. 2018 హజ్ యాత్రకు ఆంధ్రా యాత్రికు లు కూడా హైదరాబాద్ నుంచే వెళ్లనున్నట్లు అధికా రులు చెప్పారు.
ఆగస్టు 1 నుంచి 16 వరకు మూడు రాష్ట్రాల వారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. 1 నుంచి 9 వరకు 4,500 మంది తెలంగాణ యాత్రికులు, 10 నుంచి 14 వరకు 2,300 మంది ఆం్ర«ధా యాత్రికులు, 15న కర్ణాటకు చెందిన 800 మంది, చివరి రోజులో మిగిలిన, వెయిటింగ్ లిస్టు ద్వారా ఎంపికైన 3 ప్రాంతాల యాత్రికులు వెళతారన్నారు.
తెలంగాణ హజ్ కమిటీ ద్వారా యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు. హైదరా బాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా యాత్రికులకు మూడ్రోజుల పాటు నాంపల్లి హజ్‌హౌస్‌లో ఆస్రా ఆసుపత్రి సౌజన్యంతో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామరు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 17 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment