
వీసీగా బాధ్యతలు స్వీకరించిన హరిబాబు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వైస్‌చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఈ.హరిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 28న హెచ్‌సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి చేసిన రాజీనామాను ఆమోదిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనను రిజిస్ట్రార్ ఎం.సుధాకర్, నాన్‌టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, స్టాఫ్ యూనియన్, ఇతర సంఘాల నాయకులు అభినందించారు.