ఆ వార్త పూర్తిగా అవాస్తవం : హరీశ్‌రావు | Harish Rao Condemn A Paper Article | Sakshi
Sakshi News home page

ఆ వార్త పూర్తిగా అవాస్తవం : హరీశ్‌రావు

Published Wed, Jul 10 2019 10:31 AM | Last Updated on Wed, Jul 10 2019 11:22 AM

Harish Rao Condemn A Paper Article - Sakshi

హైదరాబాద్‌ : తనపై వచ్చిన ఓ వార్తను టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు హరీశ్‌రావు ఖండించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు కాళ్లు మొక్కేందుకు సిద్దమయ్యారని ఓ వార్త పత్రిక(సాక్షి కాదు) కథనాన్ని ప్రచురించింది. అయితే దానిపై ట్విటర్‌లో స్పందించిన హరీశ్‌రావు.. అందులో నిజం లేదని పేర్కొన్నారు. 

ఇంద్రకరణ్‌రెడ్డి నేల మీద నుంచి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుంటే తాను సాయపడినట్టు తెలిపారు. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారని అన్నారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ఇది బాధకరమని.. భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement