![Haritaharam from bhupalapalli says SK Joshi - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/11/SK_JOSHI_4760.jpg.webp?itok=8K-i5juO)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ త్వరలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. తెలంగాణకు హరితహారం, ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛభారత్, భూ సేకరణ అంశాలపై సీఎస్ కలెక్టర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వచ్చే ఏడాది హరితహారం కింద వంద కోట్ల మొక్కలు నాటాలని సీఎం నిర్ణయించారని, దీనికనుగుణంగా ప్రతి గ్రామం, ప్రతి మున్సిపల్ వార్డులలో నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం డిజిటల్ సిగ్నేచర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సాంకేతిక సమస్యలపై రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటించి పరిష్కరిస్తారని తెలిపారు. పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment