కోత లేకుండా గుండెకు రక్తనాళ మార్పిడి
ఈ తరహా చికిత్స దక్షిణాదిలోనే తొలిసారన్న ప్రైమ్ వైద్యులు
సాక్షి, హైదరాబాద్: ఛాతిపై చిన్న గాటు కూడా పెట్టకుండా గుండె రక్తనాళ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు అమీర్ పేటలోని ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు. ఈ తరహా చికిత్స దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే తొలిదని వారు తెలిపారు. గురువారం ఆస్ప త్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వైద్యులు వివరాలు వెల్లడించారు. వరం గల్ జిల్లాకు చెందిన ఎంఎన్ మల్లికార్జున్(66) తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడు తున్నాడు. 20 ఏళ్ల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ ద్వారా గుండెకు సంబంధించిన మైట్ర ల్ వాల్వ్‌ను (ఎంవీఆర్) పద్ధతిలో రీప్లేస్ చేశారు. ఇటీవల ఆయనకు మళ్లీ గుండెపోటు వచ్చింది. దీంతో ప్రైమ్ ఆస్పత్రి ఇంటర్వెన్స నల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘును ఆశ్ర యించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళం మళ్లీ దెబ్బతిన్నట్టు గుర్తించారు.
నాళాన్ని మార్చ డం ఒక్కటే దీనికి పరిష్కారమని సూచిం చారు. అయితే బాధితుడు వయసు రీత్యా వృద్ధుడు కావడమే కాకుండా మధు మేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వయసులో మళ్లీ ఓపెన్‌హార్ట్ సర్జరీ చేస్తే ప్రాణాలకే ప్రమాద మని భావించి ట్రాన్స్ క్యాటర్ అరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టీఏవీఆర్) పద్ధతిలో రక్త నాళాన్ని మార్చాలని నిర్ణయించారు. ఆ మేరకు మోకాలు పైభాగంలోని రక్తనాళానికి చిన్న రంధ్రం చేశారు. రోగి ఇతర శరీర భాగాల నుంచి సేకరించిన నాళాన్ని గజ్జల్లోని రక్త నాళం ద్వారా గుండెకు పంపించి దెబ్బ తిన్న రక్త నాళం స్థానంలో దీన్ని విజయ వంతంగా అమర్చారు. ఈ తరహా చికిత్స చేయడం దక్షిణ భారతదేశంలోనే తొలిసారని డాక్టర్ రఘు తెలిపారు. ప్రస్తుతం మల్లికార్జున్ కోలుకుంటున్నారని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.