Prime Hospital
-
కోత లేకుండా గుండెకు రక్తనాళ మార్పిడి
ఈ తరహా చికిత్స దక్షిణాదిలోనే తొలిసారన్న ప్రైమ్ వైద్యులు సాక్షి, హైదరాబాద్: ఛాతిపై చిన్న గాటు కూడా పెట్టకుండా గుండె రక్తనాళ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు అమీర్ పేటలోని ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు. ఈ తరహా చికిత్స దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే తొలిదని వారు తెలిపారు. గురువారం ఆస్ప త్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వైద్యులు వివరాలు వెల్లడించారు. వరం గల్ జిల్లాకు చెందిన ఎంఎన్ మల్లికార్జున్(66) తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడు తున్నాడు. 20 ఏళ్ల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ ద్వారా గుండెకు సంబంధించిన మైట్ర ల్ వాల్వ్‌ను (ఎంవీఆర్) పద్ధతిలో రీప్లేస్ చేశారు. ఇటీవల ఆయనకు మళ్లీ గుండెపోటు వచ్చింది. దీంతో ప్రైమ్ ఆస్పత్రి ఇంటర్వెన్స నల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘును ఆశ్ర యించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళం మళ్లీ దెబ్బతిన్నట్టు గుర్తించారు. నాళాన్ని మార్చ డం ఒక్కటే దీనికి పరిష్కారమని సూచిం చారు. అయితే బాధితుడు వయసు రీత్యా వృద్ధుడు కావడమే కాకుండా మధు మేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వయసులో మళ్లీ ఓపెన్‌హార్ట్ సర్జరీ చేస్తే ప్రాణాలకే ప్రమాద మని భావించి ట్రాన్స్ క్యాటర్ అరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టీఏవీఆర్) పద్ధతిలో రక్త నాళాన్ని మార్చాలని నిర్ణయించారు. ఆ మేరకు మోకాలు పైభాగంలోని రక్తనాళానికి చిన్న రంధ్రం చేశారు. రోగి ఇతర శరీర భాగాల నుంచి సేకరించిన నాళాన్ని గజ్జల్లోని రక్త నాళం ద్వారా గుండెకు పంపించి దెబ్బ తిన్న రక్త నాళం స్థానంలో దీన్ని విజయ వంతంగా అమర్చారు. ఈ తరహా చికిత్స చేయడం దక్షిణ భారతదేశంలోనే తొలిసారని డాక్టర్ రఘు తెలిపారు. ప్రస్తుతం మల్లికార్జున్ కోలుకుంటున్నారని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. -
అమీర్‌పేట ప్రైమ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని ప్రైమ్ ఆసుపత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఆస్పత్రి లిఫ్ట్ సమీపంలో ఉన్న వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సనత్‌నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఏమాత్రం ఆలస్యమైనా పెద్ద ప్రమాదం జరిగి చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఫైర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
తెగిన చేయి అతికింది
సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని తెగిపోయిన ఓ బాలిక చేతిని అమీర్‌పేట్‌లోని ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అతికించారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అనురాగ్ చిత్రాన్షి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్‌రెడ్డి చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మణికట్టు పైభాగంలో తెగిన భాగాలను ఆరు గంటల వ్యవధిలో, కింది భాగాలను 16 గంటల వ్యవధిలో అమర్చవచ్చని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన తనిష్క(9) హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లోని తన తాత గంగాధర్ ఇంట్లో ఉండగా డిసెంబర్ 10వ తేదీన బాలిక కుడిచేయి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. విషయం తెలియక కింది అంతస్థులో ఉన్నవారు బటన్ నొక్కడంతో లిఫ్ట్ వేగంగా కదలి బాలిక మణికట్టు పైభాగం వద్ద పూర్తిగా తెగిపోయింది. రక్తమోడుతున్న పాపతో పాటు తెగిపడిపోయిన భాగాన్ని ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే చికిత్స కోసం సమీపంలోని ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తెగిపడిన చేతిని శుభ్రపరిచి ఐస్ గడ్డలతో నింపిన థర్మాకోల్ బాక్స్‌లో భద్రపరిచారు. మ. 2.30 గం.కు పాపను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. వైద్యులు సుమారు 8 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన చేతి ఎముకతో పాటు సిరలు, ధమనులు, కండరాలను యథావిథిగా అమర్చి కుట్లు వేశారు. ఇలా అతికించిన ఆరు గంటల్లోనే ధమనుల్లో రక్త ప్రసరణ తిరిగి ప్రారంభమైంది. బాలిక చేయి అతుక్కున్నప్పటికీ అరచేతిలో ఇంకా స్పర్శ రాలేదు. భవిష్యత్తులో చేతికి స్పర్శ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. శస్త్ర చికిత్స కోసం రూ.2 లక్షలు ఖర్చు అయినట్లు బాలిక తాత గంగాధర్ తెలిపారు.