మహబూబ్‌నగర్ : మాగనూర్ మండల కేంద్రానికి చెందిన ప్రతాప్‌రెడ్డి టెంట్‌హౌస్ దుకాణానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఆదివారం శివుల మహాపూజల కొరకు తెచ్చిన టెంట్‌లను తీసుకెళ్లి సాయంత్రం దుకాణంలో ఉంచారు. ఆ తరువాత రాత్రి ఒంటిగంటకు నిప్పంటుకొని పొగలు దుకాణం బయటకు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి యజమానులకు సమాచారం అందించారు. వారు నిప్పును ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు తెల్లవారుజామున 4 గంటలకు నారాయణపేట్ నుంచి అగ్నిమాపక దళం వచ్చి, మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలోని విలువైన సామాన్లు శామియానాలు, వంట సామాన్లు, కుర్చీలు, సౌండ్‌బాక్స్‌లు తదితర సామాన్లన్ని కాలీ బుడిదయ్యాయి. ఈ విషయంపై యజమాని మాట్లాడుతూ నా దుకాణానికి ఎవ్వరో నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నర్సయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(మాగనూర్)
మాగనూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
Published Mon, Feb 9 2015 4:48 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement