maganur
-
ఆ నీటి మడుగున ఏముంది..?
సాక్షి, కృష్ణా (మాగనూర్): మండల పరిధిలోని ముడుమాల్, పుంజనూర్ గ్రామాల మధ్యన ఉన్న కృష్ణానదిలో దాదాపు కిలోమీటర్ పొడవునా ఓ సొరంగంలా నీటి మడుగు కలదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ నీటి మడుగు ఉందని, దీని దిగువన కూడ రాతి బండనే ఉందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఈ నీటి మడుగు దాదాపు 50 అడుగుల లోతు వరకు ఉందని, నీటి దిగువన ఓ ఆంజనేయస్వామి ఆలయం, బంగారు రథం ఉందని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. ఈ నీటి మడుగు బయటకు ఎప్పుడు కన్పించదు. కానీ దీని దిగువకు కూడ ఎవ్వరుకూడ వెళ్లడానికి ప్రయత్నించలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో ఈ మడుగు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ మడుగుతో వరి పంటలకు, పశువులకు తాగునీటికి వరప్రదాయి అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి మడుగులో ఏముందో తెలుసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్థానికులు కోరతున్నారు. -
రేపు కేఎన్పీఎస్ మహాధర్నా
మాగనూర్ : కులనిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరపార్క్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు మొతిలాల్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి మండలంలోని కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
వంతెన ప్రారంభం
మాగనూర్: మండల పరిధిలోని కృష్ణానదిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత జూన్ 23 నుంచి బ్రిడ్జి పై సీసీ రోడ్డు నిర్మాణం కొరకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటూ వాహన రాకపోకలను నిల్పివేసిన విషయం పాఠకులకు విధితమే. కాగ ఎట్టకేలకు బ్రిడ్జిపై వాహనాలు వెళ్లుటకు మంగళవారం రాత్రి నుంచి అధికారులు అనుమతించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నిల్చిపోయిన వ్యాపారాలు పునఃప్రారంభం కానున్నాయి. -
దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం
మాగనూర్ (తంగడి ఘాట్ సాక్షి బృందం): కృష్ణా పుష్కరాల సందర్భంగా మాగనూరు మండలం తంగడి దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం కొనసాగుతుంది. కృష్ణ, భీమా నదుల సంగమ క్షేత్రంలో పుస్పుల దత్తపీఠాధిపతి విఠల్‌బాబా దత్తభీమేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీపాద వల్లభుడు తిరుగాడిన ఆనవాల్లు ఇక్కడవున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు మారెప్ప, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్‌రెడ్డిని పలుకరించగా నిత్యం వేలాదిమంది పుష్కర భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. -
మాగనూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
మహబూబ్‌నగర్ : మాగనూర్ మండల కేంద్రానికి చెందిన ప్రతాప్‌రెడ్డి టెంట్‌హౌస్ దుకాణానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఆదివారం శివుల మహాపూజల కొరకు తెచ్చిన టెంట్లను తీసుకెళ్లి సాయంత్రం దుకాణంలో ఉంచారు. ఆ తరువాత రాత్రి ఒంటిగంటకు నిప్పంటుకొని పొగలు దుకాణం బయటకు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి యజమానులకు సమాచారం అందించారు. వారు నిప్పును ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు తెల్లవారుజామున 4 గంటలకు నారాయణపేట్ నుంచి అగ్నిమాపక దళం వచ్చి, మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలోని విలువైన సామాన్లు శామియానాలు, వంట సామాన్లు, కుర్చీలు, సౌండ్‌బాక్స్‌లు తదితర సామాన్లన్ని కాలీ బుడిదయ్యాయి. ఈ విషయంపై యజమాని మాట్లాడుతూ నా దుకాణానికి ఎవ్వరో నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ నర్సయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (మాగనూర్)