ఆ నీటి మడుగున ఏముంది..? | A Fifty Kilo Meters Water Lagoon Found Krishna River At Maganuru | Sakshi
Sakshi News home page

ఆ నీటి మడుగున ఏముంది..?

Published Mon, Mar 11 2019 2:08 PM | Last Updated on Mon, Mar 11 2019 2:08 PM

A Fifty Kilo Meters Water Lagoon Found Krishna River At Maganuru - Sakshi

కృష్ణానదిలో సొరంగంలా కన్పిస్తున్న నీటి మడుగు

సాక్షి, కృష్ణా (మాగనూర్‌): మండల పరిధిలోని ముడుమాల్, పుంజనూర్‌ గ్రామాల మధ్యన ఉన్న కృష్ణానదిలో దాదాపు కిలోమీటర్‌ పొడవునా ఓ సొరంగంలా నీటి మడుగు కలదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ నీటి మడుగు ఉందని, దీని దిగువన కూడ రాతి బండనే ఉందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఈ నీటి మడుగు దాదాపు 50 అడుగుల లోతు వరకు ఉందని, నీటి దిగువన ఓ ఆంజనేయస్వామి ఆలయం, బంగారు రథం ఉందని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది.

ఈ నీటి మడుగు బయటకు ఎప్పుడు కన్పించదు. కానీ దీని దిగువకు కూడ ఎవ్వరుకూడ వెళ్లడానికి ప్రయత్నించలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో ఈ మడుగు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ మడుగుతో వరి పంటలకు, పశువులకు తాగునీటికి వరప్రదాయి అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి మడుగులో ఏముందో తెలుసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్థానికులు కోరతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement