వేములవాడ (కరీంనగర్ జిల్లా) : మొదటి కార్తీక సోమవారం కావడంతో కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. పర్వదినం కావడంతో సుమారు 50 వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. దర్శనం కోసం ఆలయం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు.
అయితే భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. షెల్టర్లు, తాగు నీరు, మరుగుదొడ్ల వసతి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూల్లో నిల్చుని నిల్చుని నీరసపడి అక్కడే చతికిలపడిన పరిస్థితులు కనిపించాయి.
వేములవాడలో పోటెత్తిన భక్తులు
Published Mon, Nov 16 2015 3:49 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM
Advertisement
Advertisement