రాష్ట్రానికి ఏమిస్తారో...! | Hi tension is awaiting for Central buget today | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ఏమిస్తారో...!

Published Sat, Feb 28 2015 2:29 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

రాష్ట్రానికి ఏమిస్తారో...! - Sakshi

రాష్ట్రానికి ఏమిస్తారో...!

నేటి కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు
 విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై అందరిచూపు
 ఏపీని ఆదుకోవాలంటూ అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం వినతులు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్‌పైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఏ మేరకు ఉంటాయి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో.. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పలు  సంస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొం ది. ఆ సంస్థలకు బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారనేది మరికొన్ని గంటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో తేలిపోనుంది.
 
 14 వ ఆర్థిక సంఘం సిఫారసులను ఆమోదించిన ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఎక్కువ మేరకు రాష్ట్రాలకే అప్పగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆయా పథకాలకు నిధుల వరద ఉంటుందని అంచనా వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్ 94 (3)లో ఏపీ రాజధాని నిర్మాణానికి వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇలా వచ్చే ఐదేళ్లలో రూ.1.2 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుత బడ్జెట్‌లో కనీసం రూ.5,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత  రెవెన్యూ లోటును పూడ్చడానికి రూ.500 కోట్లు,  వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసింది. ఇంకా ఎంత కేటాయిస్తారో చూడాలి.14 ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర నిధులపై ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ.. కేటాయింపులు ఎలా ఉంటాయోనని ప్రభుత్వం  ఎదురుచూస్తోంది.
 
 రాష్ట్రం వినతులు ఇవే...
 హ    పారిశ్రామిక రాయితీల్లో భాగంగా 100 శాతం కేంద్ర ఎక్సైజ్, ఆదాయ, సర్వీసు పన్ను 15 ఏళ్ల పాటు మినహాయింపు, సీలింగ్ లేకుండా 30 శాతం మూల ధన సబ్సిడీ. వర్కింగ్ కేపిటల్‌పై మూడు శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలి. 15 ఏళ్ల పాటు నూరు శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవ్వాలి.
 హ విభజన చట్టంలోని సెక్షన్ 94 (3) ప్రకారం నూతన రాజధానిలో వసతుల కల్పనకు సాయం చేయాలి. సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. హ పోలవరంపై ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన నిధులివ్వాలి.హసెక్షన్ 46 (3) ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్రకు రాయితీల కింద తొలి దశలో రూ. 2,000 కోట్లు ఇవ్వాలి.
 హ    కేంద్ర రుణాలు రూ.10,090 కోట్లు రద్దు చేయాలి.హ    ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్, గిరిజన వర్సిటీ ఏర్పాటునకు నిధులు కేటాయించాలి.హపెట్రోలియం, వ్యవసాయ వర్సిటీలు, ఎన్‌ఐడీఎం, ఎయిమ్స్ ఏర్పాటు ,దుగరాజపట్నం పోర్టు అభివద్ధికి నిధులు ఇవ్వాలి.హవిభజన జరిగిన ఆరు నెలల్లోగా వైఎస్సార్ జిల్లాలో సమీకృత స్టీల్ ప్లాంటు ఏర్పాటును పరిశీలిస్తామన్న కేంద్రం ఇప్పటివరకు దృష్టి సారించలేదని రాష్ట్రం పేర్కొంది. హగ్రీన్ ఫీల్డ్ కుర్డు ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై పరిశీలన చేస్తామని చట్టంలో పేర్కొంది.
 
 నిధుల కోసం అనేకసార్లు హస్తినకు..
 రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా చంద్రబాబు తొమ్మిది నెలల కాలంలో దాదాపు 9 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతిసారీ ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు.ఇప్పటివరకు కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీలు లభించలేదు. రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి ఆదుకోవిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరింది.  
 
 ఇతర ప్రతిపాదనలు
 కొత్త రాజధాని ప్రాంతం చుట్టూ ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.9,700 కోట్ల నిధులు కావాలి.్ళఏపీలో 642 కి.మీ మేర జాతీయ రహదారులుగా మార్చడానికి గతంలోనే కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. విశాఖపట్నం-కాకినాడ-గంగవరం-శ్రీకాళహస్తి ప్రాంతాలను కలుపుతూ ఆర్థిక ప్రాంతాన్ని  అభివృద్ధి చేయాలి.్ళగత బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటునకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర నగరాలకు రాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనక్టివిటీ ఏర్పాటునకు నిధులివ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement