'రెండు మూడురోజులు ఆగలేకపోయారా' | hicourt serious on telangana governement vc appointments | Sakshi
Sakshi News home page

'రెండు మూడురోజులు ఆగలేకపోయారా'

Published Mon, Jul 25 2016 5:05 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

'రెండు మూడురోజులు ఆగలేకపోయారా' - Sakshi

'రెండు మూడురోజులు ఆగలేకపోయారా'

హైదరాబాద్: వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. కేసు పెండింగ్లో ఉండగా నియామకాలు ఎలా చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రెండు, మూడు రోజులు ఆగలేరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు రిజర్వులో ఉంచింది. తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది.

తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్ వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సాంబశివరావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతిష్టాత్మక ఉస్మానియ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం నియమితులయ్యారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రవీణ్ రావులను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement