
సాక్షి, హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, సహక రించినవారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాస్ కాపీయింగ్ చేస్తూ గతేడాది నుంచి ఇప్పటివరకు ఎంతమంది పట్టుబడ్డారో.. ఎంతమందిపై కేసులు పెట్టారో తెలపాలని ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉభయ రాష్ట్రాల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment