సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నిబంధనలకు విరుద్ధం గా బ్యాంకు నుంచి రూ.8 కోట్లు డ్రా చేశారంటూ బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కిషన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ పవన్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
‘టీఆర్‌ఎస్ ఫిర్యాదుపై ఏం చేశారు?’
Published Tue, Apr 16 2019 2:10 AM | Last Updated on Tue, Apr 16 2019 2:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment