♦ సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్టు
♦ కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీలకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన సమాచార కమిషనర్, ఇత ర కమిషనర్లను ఎప్పటిలోపు నియమిస్తారో రాతపూర్వకంగా తెలియచేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మా సనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని.. ఈ మేరకు వారి నియామకానికి చర్యలు తీసుకునేలా తెలంగాణ, ఏపీలను ఆదేశించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి పద్మనాభయ్య ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది.
ఇంకా విభజన జరగకపోవడంతో..
తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. సమాచార కమిషన్ పునర్వి భజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉందని, అందువల్ల ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు పరస్ప రం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్క రించుకుంటాయని కోర్టుకు వివరించారు. సమాచార కమిషన్ విభజన జరగాల్సి ఉందని.. కమిషనర్ల నియామకానికి 3 నెలల గడువు కావాలని కోరారు. దీంతో మరి ఈ మూడు నెలల పాటు ప్రజల హక్కు మాటేమిటని ధర్మా సనం ప్రశ్నించింది. ఇక సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియను ఏడాది క్రితమే ప్రారం భించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది పెండింగ్‌లో ఉందని ఏపీ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు వివరించారు.
కమిషనర్ల నియామకం పెద్ద పని కాదన్నారు. అయితే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే పెద్ద పని అని, ఇందుకు కొంత సమయం పడు తుందని తెలిపారు. తమ రాష్ట్రంలోనే తాము సమాచార కమిషన్ ఏర్పాటు చేసుకుంటా మని కోర్టుకు వివరించారు. అనంతరం పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ... సమాచార కమిషన్లో 20 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, దాంతో ప్రజల హక్కులకు భంగం కలుగు తోందని కోర్టుకు వివరించారు.
ఎప్పటిలోపు నియమిస్తారు?
Published Wed, Jul 12 2017 2:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement