తాండూరు: రంగారెడ్డి జిల్లాలో కల్తీకల్లు పంజా విసురుతుంది. గత రెండు రోజులుగా తాండూరు జిల్లా ఆస్పత్రిలో 50 మంది వరకు కల్తీకల్లు బాధితులు ఆస్పత్రి పాలయ్యారు.
మల్‌రెడ్డిపల్లికి చెందిన పార్వతమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. బాధితుల పిచ్చి చేష్టలు, అరుపులతో జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. బాధితులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మత్తుపదార్థాలు లేని కల్లు సేవించడం వల్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు తెలిపారు. కాగా, రాజేంద్రనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథ్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో సోమవారం ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.