మంత్రి అజ్మీరా చందూలాల్
కేయూ క్యాంపస్ : సమైకాంధ్ర పాలనలో మరుగునపడిన తెలంగాణ చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందనిమంత్రి ఆజ్మీరాచందులాల్ కోరారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ, అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో 35వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించుకునే దిశగా సీఎం కేసీఆర్ అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నారన్నారు. చరిత్ర పరిశోధించి అనేక రకాలచరిత్ర సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీర సీతారంనాయక్ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించటం అభినందనీయమన్నారు. జిల్లాలో 61 టూరిజం ప్లేస్‌లున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఓ మూజియంను కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఐసీహెచ్‌ఆర్ చైర్మన్ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవి రంగారావు, సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ అయాబ్‌అలీఖాన్, జనరల్ ప్రసిడెంట్ ఆర్ మిశ్రా, ప్రొఫెసర్ వి కిషన్‌రావు, లోకల్ సెక్రటరీ కేయూ హిస్టరీ విభాగం అధిపతి డాక్టర్ పి.సదానందం మాట్లాడారు.
హిస్టరీ కాంగ్రెస్ ప్రొసీడింగ్స్ సీడీలను ఆవిష్కరించారు. తుంకూరు యూనివర్సిటీమాజీ వీసీ ప్రొఫెసర్ అనంతరామయ్య, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీశం, చంద్రబాబు, గౌతమ్, కేరళ యూనివర్సిటీ ప్రొఫెసర్‌శోభనం, మదురై యూనివర్సిటీ ప్రొఫెసర్ డేనియల్, డాక్టర్ అబ్బాస్ కేయూ హిస్టరీ విభాగం ప్రొఫెసర్‌టి దయాకర్‌రావు, ప్రొఫెసర్ టి విజయబాబు,ప్రొఫెసర్ శ్రీనాధ్,డాక్టర్ టిమనోహర్ ,పరిశోధకులు వివిధ చోట్లనుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.
చరిత్రను వెలికి తీయాలి
Published Sat, Feb 21 2015 12:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement