హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు | hitech prostituon busted in hyderabad | Sakshi
Sakshi News home page

హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

Published Mon, Jun 29 2015 9:45 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు - Sakshi

హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

హైదరాబాద్: ‘‘లపాకీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. అందులో అప్‌లోడ్ చేసిన సెక్స్‌వర్కర్ల ఫొటోలు కనిపిస్తాయి. మనకిష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది’’...  ఇటీవల విడుదలైన ఓ సినిమాలో హీరోతో సహనటుడు అనే మాటలివి. యాప్‌ను సృష్టించకపోయినా  వెబ్‌సైట్లలో కాంటాక్ట్ నంబర్స్ నిక్షిప్తం చేసి విటులను ఆకర్షిస్తున్నారు వ్యభిచార నిర్వాహకులు.

లైన్‌లోకి వచ్చిన క్లయింట్స్‌కి  వాట్సాప్ లాంటి ఇన్‌స్టంట్ మేసేజింగ్ అప్లికేషన్స్ ద్వారా ఫొటోలు షేర్ చేస్తున్నారు. నచ్చిన అమ్మాయిని విటుల కోరిక మేరకు వారు రమ్మన్న హోటల్‌కి కారులో పంపిస్తున్నారు. రోజు, వారం లెక్కన అమ్మాయిలను సరఫరా చేసి లక్షల్లో దండుకుంటున్నారు. వీరి ఖాతాలో సామాన్యుల నుంచి ధనవంతులు వరకు క్లయింట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి హైటెక్ దందా నిర్వహిస్తున్న నిర్వాహకులపై సిటీ పోలీసులు నిఘా ఉంచారు.

నెల నుంచి నిఘా...
ఎం.వీరాబాబు సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలనే ఆశతో ఎనిమిదేళ్ల క్రితం వ్యభిచార దందాలో దిగాడు. జంటనగరాల్లో వ్యభిచార గృహాలు నడుపుతున్నాడు. ఇప్పటికే నాలుగు కేసుల్లో  వీరాబాబు వాంటెడ్‌గా ఉన్నాడు. ఇదే కోవలో ఆర్.రమేశ్ కూడా వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ఖలీల్, మహేశ్ రాటి, అభిజిత్ విశ్వాస్, దీప చంద్‌లు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. గతంలో నార్సింగి, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసిన మహమ్మద్ ఖలీల్ మూడు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు.

వీరందరితో పాటు సెక్స్‌వర్కర్లను కారులో పికప్, డ్రాప్ చేస్తున్న బంగారయ్యపై కూడా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. ఎప్పటి నుంచో వ్యభిచార గృహలపై దాడులు నిర్వహించడం, సెక్స్‌వర్కర్లను విడిపించడం లాంటి పనులు చేస్తున్న పోలీసులు...అసలు వ్యభిచారం ఎవరు నిర్వహిస్తున్నారు? ఎక్కడెక్కడ దందా చేస్తున్నారనే దానిపై నిఘా ఉంచారు.  నెలక్రితం నుంచే పక్కా ప్రణాళికతో వారి కదలికలను గమనిస్తూ వచ్చారు. ఆన్‌లైన్ వేదికగా చేసుకొని ఈ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులు కనిపెట్టారు.

ఎస్‌ఆర్‌నగర్‌లో నలుగురిని, టోలీచౌకిలో ఇద్దరిని, రాజేంద్రనగర్‌లో మరొకరిని అరెస్టు చేశారు. మూడు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి పంజగుట్ట పోలీసులకు నలుగురిని, తపచాబుత్రా పోలీసులకు ఇద్దరిని, గోల్కోండ పోలీసులకు ఒకరిని అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ పోలీసు కమిషనర్ లింబారెడ్డి, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజా వెంకట్ రెడ్డి, ఎస్‌ఐలు జలేందర్ రెడ్డి, వెంకటేశ్వర్‌గౌడ్, మల్లికార్జున్, ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ అరెస్టులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement