
'ఆ కుటుంబాలకు' సాయం ఎలా చేస్తారు ?
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా అమరవీరులైన కుటుంబాలకు సాయం ఎలా చేస్తారో చెప్పాలని టీటీడీపీ సభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు.
వారి కుటుంబాలకు చేసే సాయంపై ప్రభుత్వం సభలో చర్చించాలన్నారు. ఉద్యమంలో గాయపడి ఇప్పటికీ కోలుకోలేనివారు ఉన్నారని ఎర్రబెల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని ఆయన అన్నారు.