
జలమయమైన మిథిలా నగర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో మొన్న కురిసిన భారీ వర్షానికి మీర్‌పేట్ పరిధిలోని మిథిలా నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వర్షం తగ్గినా కాలనీ వాసులకు ఇబ్బందులు తొలగలేదు. వర్షం నీరు కాలువల గుండా ఇంకా వెళ్లిపోకపోవడంతో కాలనీ చెరువును తలపిస్తోంది. ఇంటి బయట మొత్తం నీరే ఉండటంతో దసరా, బతుకమ్మ పండుగలకు కాలనీవాసులు దూరంగా ఉన్నారు.
గత 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందంటూ వారి గోడు సాక్షికి విన్నవించుకున్నారు. కాలనీ వాసులు బయటకు వస్తే ఎక్కడ ఇన్‌ఫెక్షన్లు సోకుతాయోనని ఆందోళన చెందుతున్నారు. చిన్న వర్షానికే కాలనీ మునిగిపోతే, పెద్ద వర్షం వస్తే మా పరిస్థితి ఏంటని స్థానికులు మున్సిపాలిటీ అధికారులపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment