దిగొచ్చిన అధికారులు
సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయింపు
హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు మూడేళ్ల క్రితం మంజూరైన సబ్‌స్టేషన్ నిర్మాణంలో జాప్యంపై నిరసనగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ కర్ణకంటి శ్రీశైలం చేపట్టిన ఆమరణ దీక్ష ఫలించింది. 15 రోజుల రిలే దీక్షల అనంతరం చేపట్టిన రెండు రోజుల ఆమరణ దీక్షకు అధికారులు స్పందించారు. తహశీల్దార్ రవీంద్రాచారి, ట్రాన్స్ కో ఏఈ సమ్మయ్యతోపాటు సిబ్బంది ఆదివారం ప్రభుత్వ భూమిలోని ఎకరం స్థలాన్ని కేటాయించి హద్దులు పెట్టారు.
కొన్ని రాజకీయ శక్తులు స్థలం కేటాయించకుండా అడ్డుతగులుతున్నారనే నేపథ్యంలో స్థలం విషయం ఓ కొలిక్కి వచ్చింది. సర్పంచ్ జాగిరి వసంత సత్యనారాయణ, ఎంపీటీసీ సమ్మయ్య, మాజీ సర్పంచులు కాశబోయిన ఎల్లయ్య, కర్ణకరంటి శ్రీశైలంతోపాటు గ్రామస్తుల సమక్షంలో స్థలాన్ని విద్యుత్ శాఖకు కేటారుుంచారు.
ఆమరణ దీక్ష ఫలించింది
Published Mon, May 4 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement