మద్యం మత్తులో భార్య, కూతుర్ని చంపి ఆపై ఆత్మహత్య | Husband murdered wife after killing himself | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్య, కూతుర్ని చంపి ఆపై ఆత్మహత్య

Published Mon, Mar 17 2014 6:49 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Husband murdered wife after killing himself

మెదక్: జిల్లాలోని హఫీజ్ పేటలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుటుంబాన్నిఅగ్ని ఆహుతి చేసి ఆపై అతను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫుల్ గా మద్యం తాగి వచ్చిన శరత్ అనే వ్యక్తి తొలుత భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలోనే తన భార్యను, కూతుర్ని అతి పైశాచికంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

 

వీరు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ వాసులు. గత రెండు నెలల క్రితం నాందేడ్ నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ కుటుంబం మృత్యువాత పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement