![Hyderabad Weather Department Issues Rainfall Warning Most Areas - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/22/55.jpg.webp?itok=h78bihsK)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం కేసముద్రం (మహబూబాబాద్) 7 సెం.మీ., పైడిపల్లి (వరంగల్ అర్బన్) 7 సెం.మీ., అమ్మనగల్(మహబూబాబాద్) 7 సెం.మీ., కట్టంగూర్ (నల్లగొండ) 7 సెం.మీ., ఎల్లంకి (యాదాద్రి భువనగిరి) 6 సెం.మీ., బొమ్రాస్‌పేట (వికారాబాద్) 6 సెం.మీ., కమ్మర్‌పల్లి (నిజామాబాద్) 5 సెం.మీ., రంగంపల్లి(పెద్దపల్లి) 5 సెం.మీ., ఓదెల (పెద్దపల్లి) 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment