
తెలంగాణను టోక్యో నగరంలా చూడాలి: సుమన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని జపాన్ రాజధాని టోక్యో నగరంలా చూడాలని తాను ఆశిస్తున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేలా రైతు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సుమన్.. మార్షల్ ఆర్ట్స్ ను అగ్రస్థానంలో నిలిపేలా కేసీఆర్ ప్రభుత్వం సహకరించాలన్నారు.
తాను తెలంగాణ రాష్ట్రాన్ని టోక్యో నగరం తరహాలో తాను చూడాలనుకుంటున్నట్లు సమన్ అన్నారు. ఆయన నేతృత్వంలో హైదరాబాద్ ఫిల్మ్ సిటీ దేశంలోనే నంబర్ -1గా మారనుందని సుమన్ అభిప్రాయపడ్డారు.