జిల్లాలో ఇరానీ గ్యాంగ్ హల్‌చల్ | Ilani gang chain snachings | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇరానీ గ్యాంగ్ హల్‌చల్

Published Sun, Jun 14 2015 12:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

జిల్లాలో ఇరానీ గ్యాంగ్ హల్‌చల్ - Sakshi

జిల్లాలో ఇరానీ గ్యాంగ్ హల్‌చల్

రోజుకోచోట చైన్‌స్నాచింగ్‌లు 
ఊహాచిత్రం విడుదల 
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
 
 కోల్‌సిటీ : ‘జిల్లాలో ఇరానీ గ్యాంగ్ చొరబడింది. అప్రమత్తంగా ఉండండి. గ్యాంగ్‌లోని మనుషులు ఇలాగే ఉంటారు’ అంటూ గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఆరె వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం నిందితుల ఊహాచిత్రంను విడుదల చేశారు. ఇటీవల కాలంలో వరుసగా మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లు తెంపుకుపోతున్న సంఘటనలు కళకలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా రోజుకోచోట చైన్‌స్నాచింగ్ జరుగుతోంది. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న వారు ఇరానీ గ్యాంగ్‌కు చెందినవారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, మెదక్‌లోని సిద్దిపేట ప్రాంతాల్లో ఇరానీ గ్యాంగ్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 అనుమానం రాకుండా...
 నిందితులు ఎక్కువగా ఖరీదైన ద్విచక్రవాహనాలు ఉపయోగిస్తుంటారు. ైబైక్‌లపై ఇద్దరు కూర్చొని ప్రయాణిస్తుంటారు. కొందరైతే మాస్క్‌లు ధరిస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌పై సరదాగా మాట్లాడుకుంటున్నట్లు నటిస్తూ తిరుగుతుంటారు. ఎక్కువగా నిర్మాణుశ్యమైన ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఇరానీ గ్యాంగ్‌తోపాటు కొందరు స్థానిక యువకులు కూడా చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

 ఒంటిరి మహిళలే టార్గెట్...
 జనసంచారం లేని రోడ్లపై, కాలనీలలో ఒంటిరిగా వెళ్తున్న మహిళలనే గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. అలాగే ఇంటి ముందు ఒంటరిగా ఇంటి పనులు చేస్తున్న మహిళలను కూడా నిందితులు టార్గెట్ చేస్తున్నారు. అడ్రస్ చెప్పండంటూ మాట్లాడుతూనే.. మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకుని పారిపోతుంటారు.

     ఈనెల 11న పెద్దపల్లిలోని సాయిబాబా దేవాలయం సమీపంకు చెందిన సుమతి తెల్లవారుజామున వాలికి ఊడుస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ‘ఏ రస్తా కిదర్‌జాతా’ అంటూ హిందీలో అడిగారు. సమాధానం చెప్పేలోగా ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారు.

     గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్ళే దారిలో ఈనెల 10న రాత్రి లక్ష్మి అనే మహిళ ఆస్పత్రికి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారు.

     గోదావరిఖని చంద్రబాబుకాలనీకి చెందిన ఆడెపు లక్ష్మి ఈనెల 11న ఇంటి ఎదుట పనులు చేసుకుంటూ ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ అడ్రస్ చెప్పని అమాయకంగా అడిగారు. మహిళ అడ్రస్ తెలియదని చెప్పేలోగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకుని పారిపోయారు.

     ఈనెల 17న గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన లక్ష్మి నడుచుకుంటూ వస్తుండగా.. ఆమె వెనకనుంచి ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు తెంపుకుపోయారు.

     ఈనెల 8న గోదావరిఖని యైంటిక్లైయిన్‌కాలనీలోని ఓ కిరాణ దుకాణం నిర్వహించే మహిళను నీళ్లప్యాకెట్ కావాలని అడిగి మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు.
 
 అప్రమత్తంగా ఉండండి..: డీఎస్పీ
 చైన్‌స్నాచింగ్‌లపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి సూచిం చా రు. మహిళలు విలువైన ఆభరణాలు ధరించి ఒంటిరిగా బయటకు వెళ్లొదని అన్నారు. ఆభరణాలతో బయటకు వెళ్లినప్పుడు మెడచుట్టూ చీర కొంగు కప్పుకోవాలన్నారు. కుటుం బ సభ్యులను తోడుగా తీసుకుపోవాలన్నారు. ము ఖ్యంగా తెల్లవారుజామునమహిళలు ఇంటి ఎదు ట వాకిలి ఊడ్చే సమయంలో కానీ.. ఇంటి పనులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చిరునామా కోసం అడిగితే నమ్మవద్దన్నారు. అపరి చితులు తారసపడితే వెంటనే 100 కుఫోన్‌చేయాలనిసూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement