
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో వాహనాల రద్దీని టోల్‌గోట్ సిబ్బంది ఆసరాగా తీసుకుని అక్రమంగా వసుళ్లకు పాల్పడుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్‌గేట్ వద్ద ఛార్జీలు వసూళ్లు చెయ్యవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా మహబూబ్‌నగర్ జిల్లా రాయకల్ టోల్‌గేట్ వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వం ఛార్జీలు వసూళ్లు చెయ్యవద్దని చెప్పినా సిబ్బంది వసూళ్లు చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. తమకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని టోల్‌గేట్ సిబ్బంది చెప్తున్నారు. దీంతో టోల్‌గేట్ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment