ఒక గుర్తుతెలియని దుండగుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎమ్‌ను ధ్వంసం చేశాడు.
కరీంనగర్: ఒక గుర్తుతెలియని దుండగుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎమ్‌ను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదవరిఖనిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. గుర్తు తెలియని దుండగుడు ఐఓసీ ఏటీఎమ్‌లో దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎమ్ నుంచి డబ్బు రాకపోవడంతో దానిని ధ్వంసం చేశాడు. కాగా, నిందితుడు అప్రమత్తం అవుతాడని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన బ్యాంక్ మేనేజర్ సంజయ్‌కుమార్ శనివారం పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(గోదావరిఖని)