
సాక్షి, మక్తల్ : మక్తల్ నియోజకవర్గానికి 1978 జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున నర్సిములు నాయుడు పోటీ చేశారు. ఈ మేరకు ఆయనకు మద్దతుగా మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రచారానికి వచ్చారు. మక్తల్‌లోని రాయచూర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిపన బహిరంగ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆనాటి ఇందిరాగాంధీ హిందీ ప్రసంగాన్ని రైల్వేశాఖ మాజీ శాఖ సహాయమంత్రి మల్లికార్జున్ తెలుగులోకి అనువదించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థులు పలువురు ఓటమి పాలయ్యారు. కానీ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నర్సిములునాయుడు మాత్రం జనతా పార్టీ అభ్యర్థి చిట్టెం నర్సిరెడ్డి, రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రరావు కల్యాణి వంటి వారిని ఓడించి మక్తల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment