బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు | Instructors in government teaching hospitals were restricted | Sakshi
Sakshi News home page

బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు

Published Tue, Mar 5 2019 2:34 AM | Last Updated on Tue, Mar 5 2019 2:34 AM

Instructors in government teaching hospitals were restricted - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ తదితర అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు విధించారు. నిమ్స్‌ ఆసుపత్రిలోనూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు. ఇష్టారాజ్యంగా ఎవరుపడితే వారు ఆసుపత్రుల్లో ని రోగుల వార్డుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుం టున్నారు. పాసులున్న వారు మాత్రమే నిర్ణీత వేళ ల్లో వెళ్లొచ్చేలా నిబంధనలు కట్టుదిట్టం చేశారు. బోధనాసుపత్రుల్లో జూనియర్‌ డాక్టర్ల (జూడా)పై రోగుల బంధువులు తరచూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ ఆంక్షలున్నా పూర్తిస్థాయి లో అమలు కావట్లేదని, ఇకపై కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. జూడాలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ పోస్టర్లు అంటించాలని నిర్ణయించారు.

భద్రతా చర్యలు కట్టుదిట్టం..
గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆస్పత్రులకు రోజూ దాదాపు 20 వేల మంది చొప్పున వస్తుంటారు. దీంతో వారికి వసతి సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారుతోంది. మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం గగనం గా మారుతోంది. పేదలు కావడంతో రాత్రిళ్లు కూడా ఆరు బయట లేదా రోగుల వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. బోధనాసుపత్రుల వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు తక్కువ ధరకే భోజనం అం దిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఉచితంగా టిఫిన్, భోజనం అందజేస్తున్నాయి.

దీంతో రోగుల సహా యకులు ఎక్కువ మంది వస్తూ ఇక్కడే ఉండిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. భారీగా రోగుల బంధువులు, స్నేహితులు గుమిగూడుతుండటం తో ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. రోగుల వద్దకు ఒక సహాయకుడే వెళ్లాల్సి ఉండ గా, గేట్ల వద్ద ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకుని లోపలికి పంపుతున్నారన్న విమర్శలున్నా యి. ఆసుపత్రిలో రోగుల బంధువులు, సహాయకులతోనే నిండిపోతున్నాయి. డబ్బులు తీసుకుని లోపలికి పంపే వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు. ఒక్కోసారి రోగి చనిపోతే బంధువులు డాక్టర్లపై దాడులు చేస్తున్నారు. దీంతో వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement