
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకు నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని తెలిపింది. ఇక ప్రాక్టికల్స్ 15వ తేదీ నుంచి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని పేర్కొంది.
19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జరగనుందని వెల్లడించింది. 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనున్నట్లు తెలిపింది. కాగా, ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా ఇవే తేదీలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక టైం టేబుల్‌ను జారీ చేయనున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి