ఇదీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ | intermediate time table 2015 | Sakshi
Sakshi News home page

ఇదీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్

Published Fri, Nov 14 2014 12:52 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

ఇదీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ - Sakshi

ఇదీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్

  • ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • తెలంగాణ సర్కార్‌కు తెలిపినట్లు వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన టైమ్ టేబుల్‌తో కూడిన ప్రతిపాదనను తెలంగాణ సర్కారుకు పంపినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్ శంకర్ నాయక్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రశ్న పత్రాలు ఉమ్మడిగానే ముద్రించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తే ఈ కింది తేదీల ప్రకారం ఇంటర్ పరీక్షలు ఖరారు అవుతాయి.
     
    ఏకపక్షంగా షెడ్యూల్!


    ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకెళ్లారు. గురువారం జగదీశ్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలియజేయకముందే.. గురువారం ఏపీ విద్యా మంత్రి ఇంటర్ పరీక్షల షెడ్యూలును ఏకపక్షంగా ప్రకటించారని సీఎంకు మంత్రి వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించాలా? వద్దా? తేదీల్లో మార్పులు చేయాలా? అనే అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగానే ఉండాలన్న ప్రధాన అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల వ్యవహారం, నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై శుక్రవారం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
     
     తేదీలు            సబ్జెక్టు

     మార్చి 11    ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ భాష (తెలుగు తదితర)
     మార్చి 12    సెకండ్ ఇయర్, ద్వితీయ భాష (తెలుగు తదితర)
     మార్చి 13    ఇంటర్-1 ఇంగ్లీష్
     మార్చి 14    ఇంటర్-2 ఇంగ్లీష్
     మార్చి 16    గణితం-1ఎ, బోటనీ-1, సివిక్స్-1
     మార్చి 17    గణితం-2ఎ, బోటనీ-2, సివిక్స్-2
     మార్చి 18    జువాలజీ-1, హిస్టరీ-1
     మార్చి 19    గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2
     మార్చి 20    ఫిజిక్స్-1, ఎకనమిక్స్-1
     మార్చి 23    ఫిజిక్స్-2, ఎకనమిక్స్-2
     మార్చి 24    కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1
     మార్చి 25    కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2
     మార్చి  26    జువాలజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హోమ్ సైన్స్-1
     మార్చి 27    జువాలజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, హోమ్ సైన్స్-2
     మార్చి 30    జాగ్రఫీ-1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-1
     మార్చి 31    జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-2

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement