Inter-tests
-
‘వేరే’ ఎంసెట్!
పరీక్షలను వేరుగా నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు స్పష్టీకరణ కాలేజీల్లో 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో భర్తీ చేస్తామంటున్న వైనం ఉమ్మడి ఎంసెట్ కోసం తెలంగాణ అంగీకారం కోరుతామన్న ఏపీ మంత్రి సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఇంటర్మీడియెట్ పరీక్షలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం ఇపుడు ఎంసెట్‌పైనా నెలకొంటోం ది. ఇంటర్మీడియెట్ పరీక్షలను వేరుగా నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎంసెట్‌నూ వేరేగానే నిర్వహించుకుంటామని చెప్తుండటంతో ఏపీ అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు వేరుగా జరుగుతున్నా ఎంసెట్ ఉమ్మడిగానే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని గవర్నర్ ఇటీవల ఢిల్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఏపీ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ఎంసెట్ షెడ్యూల్‌పై కసరత్తు చేపట్టింది. అయితే తెలంగాణ నుంచి మాత్రం ఉమ్మ డి ఎంసెట్‌కు సానుకూలత వ్యక్తంకాలేదని తెలుస్తోంది. ఇంటర్మీడియెట్ మాదిరిగానే ఎంసెట్‌తో సహా అన్ని సెట్లనూ తాము వేరుగానే నిర్వహిస్తామని స్పష్టంచేసినట్లు చెప్తున్నారు. ఉన్నత విద్యను పదో షెడ్యూల్లో చేర్చినందున ఉమ్మడిగానే ఎంసెట్ పరీక్షలు ఉండాలని ఏపీ వాదిస్తు న్నా దానికి తెలంగాణ ససేమిరా అంటోంది. చట్టంలో పరీక్షలు ఉమ్మడిగా ఉండాలన్న నిబం ధన లేదని వాదిస్తోంది. తమ రాష్ట్ర పరీక్షలు తామే నిర్వహించుకుంటామని, కాలేజీల్లోని 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో భర్తీచేస్తామని చెప్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి తాను వేరేగా నిర్వహిస్తామని పట్టుబట్టడం, చివరకు వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం విదితమే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ ఉన్నత విద్యామండలే ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో తాను నేరుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండా ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి ముగించింది. ఇప్పుడూ ఎంసెట్‌పై అదేరకమైన అభ్యంతరాలు వస్తుండడంతో ప్రకటన విడుదల విషయంలో సందిగ్ధంలో పడింది. దీనిపై ప్రభుత్వాల నుంచి స్పష్టమైన వైఖరి వచ్చాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ‘‘ఇంటర్మీడియెట్ మాదిరిగానే ఉమ్మడి ఎంసెట్‌పైనా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టేలా కనిపిస్తోంది. విద్యార్థులకు జరిగే నష్టాన్ని వారికి మరోసారి వివరించి ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించడానికి అంగీకరించాలని కోరుతాం’’ అని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
ఇంటర్ పరీక్షలపై ఏం చేశారు ?
రెండు రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యదర్శి లేఖ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి శనివారం ఒక లేఖ రాశారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు గతంలో సమావేశమై ఉమ్మడిగానే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అంశంపై అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఇదీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్
ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌కు తెలిపినట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన టైమ్ టేబుల్‌తో కూడిన ప్రతిపాదనను తెలంగాణ సర్కారుకు పంపినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్ శంకర్ నాయక్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రశ్న పత్రాలు ఉమ్మడిగానే ముద్రించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తే ఈ కింది తేదీల ప్రకారం ఇంటర్ పరీక్షలు ఖరారు అవుతాయి. ఏకపక్షంగా షెడ్యూల్! ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకెళ్లారు. గురువారం జగదీశ్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలియజేయకముందే.. గురువారం ఏపీ విద్యా మంత్రి ఇంటర్ పరీక్షల షెడ్యూలును ఏకపక్షంగా ప్రకటించారని సీఎంకు మంత్రి వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించాలా? వద్దా? తేదీల్లో మార్పులు చేయాలా? అనే అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగానే ఉండాలన్న ప్రధాన అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల వ్యవహారం, నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై శుక్రవారం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తేదీలు సబ్జెక్టు మార్చి 11 ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ భాష (తెలుగు తదితర) మార్చి 12 సెకండ్ ఇయర్, ద్వితీయ భాష (తెలుగు తదితర) మార్చి 13 ఇంటర్-1 ఇంగ్లీష్ మార్చి 14 ఇంటర్-2 ఇంగ్లీష్ మార్చి 16 గణితం-1ఎ, బోటనీ-1, సివిక్స్-1 మార్చి 17 గణితం-2ఎ, బోటనీ-2, సివిక్స్-2 మార్చి 18 జువాలజీ-1, హిస్టరీ-1 మార్చి 19 గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2 మార్చి 20 ఫిజిక్స్-1, ఎకనమిక్స్-1 మార్చి 23 ఫిజిక్స్-2, ఎకనమిక్స్-2 మార్చి 24 కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1 మార్చి 25 కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2 మార్చి 26 జువాలజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హోమ్ సైన్స్-1 మార్చి 27 జువాలజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, హోమ్ సైన్స్-2 మార్చి 30 జాగ్రఫీ-1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-1 మార్చి 31 జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-2 -
పాత పద్ధతిలోనే ఇంటర్ పరీక్షలు!
రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చేవరకు పాత విధానమే అమలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ 2014-15 విద్యాసంవత్సరం మొదటి, రెండో సంవత్సరపు పరీక్షలను పాత విధానంలోనే నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, మొదటి ఏడాది పరీక్ష రద్దు తదితర కీలకాంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయానికి వస్తున్నారు. ఈ అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఒక స్పష్టత వచ్చేవరకు పాత పద్ధతిలోనే పరీక్షలను చేపట్టనున్నారు. ఈలోపున రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో చేసే ప్రతిపాదనలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రమే అమలు చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను సకాలంలో నిర్వహించాలంటే ఆగస్టు నుంచే ఏర్పాట్లు ప్రారంభం కావాలి. ఒక రాష్ట్ర ప్రతిపాదనను మరో రాష్ట్రం నిరాకరిస్తుండడంతో సమస్య జటిలమవుతోంది. ఈ తరుణంలో సమయం దాటిపోతున్నందున ప్రస్తుత విధివిధానాల ప్రకారమే ముందుకు వెళ్లాలని ఇంటర్‌బోర్డు అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పనపై భిన్న వాదనలు.. ఇంజనీరింగ్ తదితర కోర్సులకు ఉమ్మడి ప్రవేశాలతోపాటు ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజి ఉన్నందున ఒకేరకమైన ప్రశ్నపత్రం అమలు కావాలని, ప్రశ్నపత్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూపొందిస్తే సులభ ప్రశ్నలు ఇచ్చారనే పరస్పర అనుమానాలు వస్తాయని ఏపీ అభిప్రాయపడుతోంది. ఇంటర్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించాలని, ఒకే ప్రశ్నపత్రం అయితే.. తమ పిల్లలకు ఎక్కువమార్కులు సాధించడం కోసం ఎవరికి వారు ప్రశ్నపత్రాలు లీక్ చేసే ప్రమాదముందని తెలంగాణ ప్రాంత నేతలు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు, బోర్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రశ్నాపత్రాల అంశం చర్చకు వచ్చినా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.సీబీఎస్ఈ మాదిరిగా రెండో ఏడాది మాత్రమే పబ్లిక్ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. తెలంగాణనుంచి దీనికి వ్యతిరేకత వచ్చింది. ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ తాను ఏపీ క్యాడర్‌కు వెళ్తున్నందున నిర్ణయం తీసుకోవడం సబబుకాదంటూ విద్యాశాఖ కమిషనర్‌కు ఫైలు పంపేశారు.