గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తెలంగాణలో ఇటీవల జరిగిన టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ వేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. విజయ వాడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ‘టేకులపల్లి ఎన్‌కౌంటర్– రాజ్యహింస’ అనే అంశంపై మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ను ఉమ్మడి వేదిక తీవ్రంగా ఖండించింది.
బూటకపు ఎన్‌కౌం టర్లు, అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమా లను బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంభి నరసిం హయ్య మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభ లకు తెలంగాణ ప్రభుత్వం రక్తంతో స్వాగతం పలికిం దన్నారు. గత పాలకుల విధానాలనే కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. ఏపీ రైతు కూలీ సంఘం ప్ర«ధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయు లు మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్లు, అణచివేతలతో ప్రజాఉద్యమాలను ఆపలేరన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలపై నిర్బంధం కొనసాగుతోంద న్నారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) నేతలు రామా రావు, పోలారి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కె. అను రాధ, న్యాయవాది వై.కోటేశ్వరరావు, పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి సతీశ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, పీడీఎం నాయకులు రామ కృష్ణ, ఎన్వీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment