నాలుగు రోజుల్లో మరిన్ని బదిలీలు! | IPS officers in state to get transfers | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో మరిన్ని బదిలీలు!

Published Thu, Jan 26 2017 1:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

IPS officers in state to get transfers

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే పదోన్నతి పొం దిన ఐపీఎస్‌ అధికారుల బదిలీకి సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు బుధవారం రాత్రి వరకు కసరత్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డీజీ పీలుగా పదోన్నతి పొందిన అధికారుల్లో పలు వురు అధికారులకు బదిలీ ఉన్నట్లు వినిపిస్తోం ది. హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌గా మహేంద ర్‌రెడ్డినే కొనసాగించనున్నట్లు తెలిసింది. కృష్ణప్రసాద్‌ను పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ లేదా హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం.
 
హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌ త్రివేదీని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిం చేందుకు సీఎం కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలు స్తోంది. తనను ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసిన జైళ్ల శాఖ డీజీని హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమి స్తారన్న వార్తలు వినిపి స్తున్నాయి. పదోన్నతి పొందిన జితేందర్‌ను సీఐడీ అదనపు డీజీపీగా నియమించనున్నారు. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొందిన స్టీఫెన్‌ రవీంద్రను హైదరా బాద్‌ శాంతి భద్రతల అదనపు కమిషనర్‌గా లేదా హైదరాబాద్‌/ వరంగల్‌ జోన్‌ ఐజీగా నియమించే అవకాశాలు న్నట్లు సమాచారం.
 
 హైదరాబాద్, వరంగల్‌ జోన్ల బాధ్యతలు పర్య వేక్షిస్తున్న ఐజీ నాగిరెడ్డిపై అదనపు బాధ్యత లను తగ్గించేందుకు ఉన్నతాధికారులు ప్రతిపా దించారు. ఐజీగా పదోన్నతి పొందిన శశిధర్‌ రెడ్డిని ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా నియమిం చనున్నట్లు తెలిసింది. డీఐజీలుగా పదోన్నతి పొందిన వి.రవీందర్‌ను హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ లేదా సైబరాబాద్‌ జాయింట్‌ కమిష నర్‌గా నియమించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్న అకున్‌సబర్వాల్‌ను వరంగల్‌ కమిషనర్‌గా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఐ జీగా పదోన్నతి పొందిన ఖమ్మం కమిషనర్‌ షానా వాజ్‌ ఖాసీంను రాచకొండ జాయింట్‌ కమిషనర్‌గా నియమించనున్నారని సమాచా రం. వీరి బదిలీకి సంబంధించి 4 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
 
హోంగార్డుల జీతాల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌
డిమాండ్ల పరిష్కారానికి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న హోంగార్డుల విషయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ప్రగతిభవన్‌లో డీజీపీ అనురాగ్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, హోంగార్డు ఐజీ బాలానాగాదేవీలతో హోంగార్డుల సమస్యలపై సీఎం చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం హోంగార్డులకు రూ.12 వేలు చెల్లిస్తున్న జీతాన్ని రూ.16వేలకు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు ఉన్నతా ధికారుల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఉత్తర్వులపై సీఎం సంతకం చేసినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పెరిగిన జీతం అందేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య భద్రత స్కీముతో పాటు బస్‌పాసులు, మహిళా హోంగార్డులకు జీతంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement