వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్
మహదేవపూర్ : మారుమూల ప్రాంతాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. బీరసాగర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీరందించాలనే మహోన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ప్రారంభించి, అనేక పథకాలకు నిధులు కేటాయిస్తే... ఆయన మరణానంతరం ఆ పథకాలపై పాలకులు శీతకన్ను వేస్తున్నారన్నారు.
మారుమూల ప్రాంతాలైన కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన చేశారన్నారు. కానీ, ఇప్పుడు రూ.270 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నా... పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని పూర్తి చేయించాలని కోరారు. మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ స్వాగతించతగినదే అయినా ఎత్తిపోతల పథకాలు కూడా పూర్తి చేయించాలన్నారు.
కాళేశ్వరంలో జూలైలో జరగనున్న పుష్కరాల కోసం నిధులు కేటాయించి ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నా రు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్శదర్శులు బోయినిపల్లి శ్రీనివాసరావు, అక్కినపెల్లి కుమార్, గూడూరి జయపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి సెగ్గెం రాజేశ్, బీసీ సెల్ జిల్లా నాయకులు వరాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకుడు ప్రశాంత్, విద్యార్థి విభాగం నాయకుడు సంతోష్‌రెడ్డి, దళిత సామాజిక కార్యకర్త మల్లేశం పాల్గొన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తి చేయాలి
Published Sat, Feb 28 2015 2:55 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement