surya prakash reddy
-
‘రాష్ట్రాన్ని విడిచి వెళ్తా.. రాజకీయాలు వదిలేస్తారా!’
సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మతి భ్రమించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డితో తను తీసుకున్న ఫోటోలు మాజీ మంత్రి దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఒక ఘటనలో భూ ఆక్రమణకు యత్నించిన సూర్య ప్రకాశ్ రెడ్డి.. సీఎం జగన్మోహన్రెడ్డికి సన్నిహితుడని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బండారుపై విరుచుకుపడ్డారు నిజానికి తాను ప్రజా సంకల్ప యాత్రలో కార్యకర్తగా సీఎం జగన్మోహన్రెడ్డితో ఫోటో దిగినట్లు స్పష్టం చేశారు. తనకు భూ ఆక్రమణలతో సంబంధం ఉందని నిరూపిస్తే రాష్ట్రాన్ని విడిచి వెళ్తానని సూర్యప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. నిరూపించలేని పక్షంలో బండారు సత్యనారాయణమూర్తి, అతని తనయుడు రాజకీయాలు విడిచి వెళ్తారా అని ప్రశ్నించారు. చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ కన్నడ నటుడు -
కలెక్టరా..టీడీపీ కార్యకర్తా?
కోడుమూరు: ‘జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ పచ్చసొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తూ పరువు తీస్తున్నాడు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్లెజనం కోసం ఎల్లెల్సీ నీటిని కుంటలు, చెరువులకు వదలాలని ఉత్తరం రాసి నెల రోజులైనా మాట మాత్రం జవాబురాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడంలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదని బోర్డు పెట్టండి సరిపోతుంది’ అంటూ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలెక్టర్ తీరుపై విరుచుకుపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గురువారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు. ‘వర్షాలు లేక రైతాంగం ఆవస్థలు పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను టీడీపీ ప్రభుత్వం, అధికారులు కాపాడలేరు. ఈ ఐదేళ్లు ప్రజలను ఆ భగవంతుడే రక్షించాలి’ అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కె.హేమాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యంలో ప్రకాశిస్తున్న యువ కిరణం
తొలిపంటలోనే అధిక దిగుబడి! రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల పెట్టుబడి పెరుగుతున్నా నికరాదాయం తగ్గిపోతుండడంతో సాగు నానాటికీ కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పలువురు రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి రాణిస్తున్నారు. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన పలువురు యువ రైతులు దేశవాళీ ఆవులను సమకూర్చుకొని ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. సేద్యాన్ని ఆశావహమైన వృత్తిగా మలచుకుంటూ తోటి రైతాంగంలో స్ఫూర్తిని నింపుతున్న యువ రైతుల్లో పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ఒకరు. వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం- సేద్య పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడంలోనే ఇమిడి ఉందని సూర్యప్రకాశ్‌రెడ్డి అనుభవం చాటిచెబుతోంది. ‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు’ ఇదీ ప్రకృతి సూత్రం. ఈ సూత్రాన్ని మనసా వాచా కర్మణా నమ్మి ధైర్యంగా ముందడుగేసిన రైతు బతుకూ పచ్చగా ఉంటుంది. విద్యాధిక యువ రైతు పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకృతి సేద్య అనుభవాలే అందుకు నిదర్శనం. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం తాపలకొత్తూరు గ్రామం ఆయన స్వగ్రామం. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ(వృక్షశాస్త్రం) చదివిన సూర్యప్రకాశ్ తర్వాత ఒక రసాయనిక ఎరువుల కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. తమకున్న పదెకరాల తేలికపాటి భూమికి డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేసుకొని సూర్యప్రకాశ్ తండ్రి రాఘవరెడ్డి, సోదరుడు రాజశేఖరరెడ్డి రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చీనీ(బత్తాయి), వేరుశనగ తదితర పంటలు పండించేవారు. ఎప్పటికప్పుడు నిపుణుల సూచనల మేరకు అందుబాటులోకి వచ్చిన కొత్త ఉత్పాదకాలను వాడినప్పటికీ.. ఖర్చుకు తగిన ఆదాయం రాకపోగా నానాటికీ పరిస్థితి దిగజారుతుండడం సూర్యప్రకాశ్‌ను కలవరపరచింది. ఈ పూర్వరంగంలో సాగును గిట్టుబాటుగా మార్చుకునే లక్ష్యంతో ప్రత్యామ్నాయ సేద్య పద్ధతులపై దృష్టి సారించాడు. యువ రైతు జీవితాన్ని మార్చేసిన శిక్షణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ గ్రంథాలను అధ్యయనం చేశాడు. 2013లో మహబూబ్‌నగర్‌లో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై లోతుపాతులను ఆకళింపుచేసుకున్నాడు. రోజుకు 10 గంటల చొప్పున ఐదు రోజులు కొనసాగిన ఈ శిక్షణ అతని జీవితాన్నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. నవంబర్ నుంచి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాడు. నాలుగు దేశవాళీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం తయారుచేసుకొని వాడుతున్నారు. చీడపీడల అదుపునకు నిమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను పాలేకర్ సూచించిన ప్రకారం స్వంతంగా తయారుచేసుకొని వాడుతున్నాడు. తొలి ఏడాదే గణనీయమైన ఫలితాలు సాధించి గ్రామంలో రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అధిక దిగుబడి.. అధిక నికరాదాయం.. తండ్రి 11 ఏళ్లనాడు మూడెకరాల్లో నాటిన చీనీ తోటను 2013 నవంబర్ నుంచి సూర్యప్రకాశ్ ప్రకృతి సేద్యంలోకి మార్చారు. బత్తాయిలో కాకర, అలసంద పంటలను అంతర పంటలుగా వేశారు. 3,500 లీటర్ల ట్యాంకులో జీవామృతాన్ని తయారు చేసి, డ్రిప్ ద్వారా పంటలకు సరఫరా చేస్తున్నారు. 2014లో 18 టన్నుల బత్తాయి పండ్ల దిగుబడి ద్వారా రూ. 2.25 లక్షల ఆదాయం వచ్చింది. జీవామృతం తదితరాల తయారీ, కూలీలు, రవాణా చార్జీలు, పిచికారీలకు కలిపి రూ. 25 వేల ఖర్చు పోగా.. రూ. 2 లక్షల నికరాదాయం వచ్చిందని సూర్యప్రకాశ్‌రెడ్డి ఆనందంగా చెప్పారు. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడినప్పుడు రూ. 90 వేలు ఖర్చయినా.. దిగుబడి 15 టన్నులకు మించలేదు. తొలి పంటలోనే సత్ఫలితాలు కనిపించడంతో సూర్యప్రకాశ్‌కు ప్రకృతి సేద్యం దిగుబడి, ఆదాయాల పరంగా అనుసరణీయమేనన్న భరోసా కలిగింది. ప్రస్తుతం బత్తాయిలో అంతరపంటగా కాకర, అలసంద వేశారు. వేసవిలో మునగ, బొప్పాయి అంతరపంటలుగా వేయాలనుకుంటున్నారు. అరటిలో అంతర పంటగా వేరుశెనగ గత జూన్‌లో మూడెకరాల్లో అరటి నాటారు. అంతరపంటగా వేరుశెనగ ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 24 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. వేరుశనగ పప్పు క్వింటా రూ. 5,350ల ధర పలికింది. ఆ తర్వాత రెండో అంతరపంటగా పప్పు దోసను కేవలం రూ. వెయ్యి ఖర్చుతో సాగు చేసి రూ. 18 వేల ఆదాయం పొందారు. అరటి మరో 3 నెలల్లో గెలలు వేయనుంది. ముప్పావు ఎకరంలో పత్తిని పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 5 క్వింటాళ్ల దిగుబడి పొందారు. తమ ప్రాంతంలో తేలికపాటి నేలలో కరువు పరిస్థితుల్లో ఈ దిగుబడి తక్కువేమీ కాదని ఆయన అన్నారు. ఇంటి అవసరాల కోసం కొద్ది విస్తీర్ణంలో గోధుమ సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు పూర్తిగా మానేసి క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నందు వలన భూమిలో వానపాములు, మేలుచేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంటలకు సహజ పోషకాలను అందిస్తున్నాయని సూర్యప్రకాశ్ తెలిపాడు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతు తనకు ఎన్నో ఏళ్లుగా అలవాటైన సాగు పద్ధతి నుంచి, అది ఎంత నష్టదాయకంగా ఉన్నా, కొత్త పద్ధతిలోకి మారటం అంత తేలిక కాదు. కానీ, సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడం తప్ప సంక్షోభం నుంచి బయటపడే మారో మార్గం లేదని ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ(ఎఫ్ఏఓ) మొత్తుకుంటున్నది. ఉన్నత విద్యావంతుడైన సూర్యప్రకాశ్ వంటి యువ రైతుల చొరవ వల్ల ఈ మార్పు దిశగా వడివడిగా అడుగులు పడే అవకాశం ఉంది. - గవిని శ్రీనివాసులు, కర్నూలు వ్యవసాయం ప్రకృతి సేద్యాన్ని ప్రభుత్వం గుర్తించి, ప్రోత్సహించాలి రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సేద్యం కొనసాగించలేని సంక్షోభ పరిస్థితి వచ్చింది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలనిస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు సబ్సిడీపై దేశవాళీ ఆవులను పంపిణీ చేయాలి. ఏ పంటలనైనా సాగు చేయొచ్చు. విద్యాధిక యువతకూ ఉద్యోగం కంటే ప్రకృతి సేద్యమే మిన్న. ప్రకృతి సేద్యన్ని విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాం. ఈ ఉద్దేశంతోనే కర్నూలులో మార్చిలో పాలేకర్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరం నిర్వహించాం. - పంచలింగాల సూర్యప్రకాష్‌రెడ్డి (96038 34633), తాపలకొత్తూరు, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా -
కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తి చేయాలి
వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ మహదేవపూర్ : మారుమూల ప్రాంతాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. బీరసాగర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీరందించాలనే మహోన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ప్రారంభించి, అనేక పథకాలకు నిధులు కేటాయిస్తే... ఆయన మరణానంతరం ఆ పథకాలపై పాలకులు శీతకన్ను వేస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాలైన కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన చేశారన్నారు. కానీ, ఇప్పుడు రూ.270 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నా... పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని పూర్తి చేయించాలని కోరారు. మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ స్వాగతించతగినదే అయినా ఎత్తిపోతల పథకాలు కూడా పూర్తి చేయించాలన్నారు. కాళేశ్వరంలో జూలైలో జరగనున్న పుష్కరాల కోసం నిధులు కేటాయించి ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నా రు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్శదర్శులు బోయినిపల్లి శ్రీనివాసరావు, అక్కినపెల్లి కుమార్, గూడూరి జయపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంథని నియోజకవర్గ ఇన్చార్జి సెగ్గెం రాజేశ్, బీసీ సెల్ జిల్లా నాయకులు వరాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకుడు ప్రశాంత్, విద్యార్థి విభాగం నాయకుడు సంతోష్‌రెడ్డి, దళిత సామాజిక కార్యకర్త మల్లేశం పాల్గొన్నారు. -
వరద గూ(గో)డు
తుంగభద్ర ఉగ్రరూపం ఇప్పటికీ గుర్తే. ఆ దృశ్యాలు చెరిగిపోని చేదు జ్ఞాపకాలు. తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడొస్తుంది. ఊరూవాడా కొట్టుకుపోగా.. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలు కోకొల్లలు. ప్రాణమైతే మిగిలింది కానీ.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ సరిపెట్టింది. అత్తెసరు సాయంతో మూతి పొడిచింది. గూడు పేరిట.. మొండి గోడలతో సరిపెట్టింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ వరద బాధితులను వెక్కిరిస్తోంది. కర్నూలు(రూరల్): ఐదేళ్లు గడిచినా వరద బాధితులకు గూడు కరువైంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. నిర్మాణంలోని ఇళ్లను పూర్తి చేస్తామని.. తక్కినవి బాధితులే కట్టుకుంటే పరిహారం ఇస్తామనే హామీతో బాధ్యత నుంచి తప్పుకుంది. 2009లో వరదలు బీభత్సం సృష్టించగా.. ఆరు నెలల్లోపు బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని నమ్మబలికిన నేతలు ఆ తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడిక కొత్త ప్రభుత్వం చుట్టూ వీరి ఆశల ‘పందిరి’ అల్లుకుంటోంది. కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల, జి.శింగవరం, నిడ్జూరు, మునగాలపాడు, మామిదాలపాడు గ్రామాలను వరదలు తుడిచిపెట్టేశాయి. సుంకేసుల గ్రామంలో పునరావాస కాలనీలో 576 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 100 పూర్తి కాగా.. మిగతా ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. కాలనీలో మంచినీటి పైపులైన్లు, అంతర్గత రోడ్ల ఊసే కరువైంది. జి.శింగవరంలో 1039 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 692 పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంతర్గత రోడ్లు నిర్మించకపోవడం.. వీధి లైట్లు.. పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వరద బాధితుల్లో ఇళ్లలో కాపురం ఉండేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రోడ్లకు రూ.80 లక్షలు మంజూరైనా పనులు చేపట్టకపోవడం గమనార్హం. నిడ్జూరుకు 966 ఇళ్లు మంజూరు కాగా 654 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 200 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. మిగతా ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ భూ సేకరణ కూడా చేపట్టకపోవడం వరద బాధితుల దుస్థితికి నిదర్శనం. ఇక్కడా పైపులైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. మామిదాలపాడులో 459 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 2011లో ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, అప్పటి కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ భూమి పూజ చేశారు. ఆ తర్వాత 22 ఇళ్లకు మాత్రమే పునాది పడినా ఇప్పటికీ నిర్మాణం ఒక్క అడుగు కూడా కదలకపోవడం నేతల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పైకప్పు ఏసినారంతే.. సెంటు భూమి లేదు. కూలికి పోతేనే పూట గడిచేది. 2009లో వచ్చిన వరదల్లో ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన తడికెలతో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాం. వానలకు అది కూడ కూలిపాయ. ఇప్పుడు చెట్ల కింద బతుకుతున్నాం. ఐదుగురు కూతుళ్ల పెండ్లిళ్లు సేయనీక శానా కష్టపడిన. ఇల్లు కట్టిస్తామని సెప్పిన సారోల్లు పైకప్పు ఏసి వదిలేసినారు. సిమెంట్ సేయలేదు. పేదలంటే అందరికీ లోకువే. కాలనీల ఉండలేకపోతున్నాం.- ఉసేనమ్మ, నిడ్జూరు ఇళ్ల మధ్య కంప సెట్లు వరదల్లో కట్టుబట్టలతో మిగిలినం. అప్పులు సేసి ఏసుకున్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాం. ఇద్దరు కొడుకులున్నారు. కూలి పనికి పోతేనే పూట గడుస్తాది. మాలెక్కటోల్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తాదంటే సంతోషించిన. పనులైతే మొదలు పెట్టినారు కానీ సరిగ జరుగుతలేవు. కరెంటు, నీళ్లు, రోడ్లు లేక రేత్రిల్లు శానా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల మధ్య కంప సెట్లు పెరిగినాయి. యా సారూ మా బాధలు పట్టించుకోల్యా. మా బతుకులింతే.- మల్లికార్జునయ్య, జి.శింగవరం -
పెద్ద మనుషులు.. చిన్న బుద్ధులు
కోట్ల, కేఈ కుటుంబాల రహస్య ఒప్పందం సాక్షి ప్రతినిధి, కర్నూలు: హోదా పెరిగే కొద్దీ వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. ఆ నేతలు మాత్రం ఇందుకు అతీతం. ఒకప్పటి ఆదరణను అడ్డంగా పెట్టుకొని మరొకరిని ఎదగనీయకుండా సాగిస్తున్న స్వార్థ రాజకీయం నవ్వులపాలవుతోంది. పేరుకు పార్టీలు వేరైనా.. తెరవెనుక కలిసి నడుస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఈ రెండు కుటుంబాలను తాజా ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. సొంత నియోజకవర్గంలోనే ఓట్లు పడని పరిస్థితుల్లో ఇరువురూ పక్క నియోజకవర్గాల్లో బరిలో నిలిచినా ఆపసోపాలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరికొకరు పార్టీలకు అతీతంగా సహకరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మ.. కేఈ సోదరులకు చావోరేవో అన్నట్లు తయారయ్యాయి. కర్నూలు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈయనను గెలిపించే బాధ్యతను కేఈ కుటుంబం భుజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న కోట్ల సుజాతమ్మ గెలుపు బాధ్యత కూడా వీరే తీసుకున్నట్లు ‘పచ్చ’ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రతిగా పత్తికొండలో కేఈ కృష్ణమూర్తికి.. డోన్‌లో కేఈ ప్రతాప్ గెలుపునకు కోట్ల కుటుంబం హామీ ఇచ్చినట్లు సమాచారం. సొంత పార్టీ అభ్యర్థులను బలిపశువులను చేస్తూ ఈ రెండు కుటుంబాలు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఓడిపోయేందుకు గాను ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులకు ప్యాకేజీలు ముట్టజెప్పినట్లు వినికిడి. కోట్ల వర్గం డోన్, పత్తికొండలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతుండగా.. ఈ రెండు ప్రాంతాల్లో కేఈ వర్గం ఎంపీ ఓటు కాంగ్రెస్‌కు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కర్నూలులో చిత్రమైన పొత్తు కుదిరింది. ఇక్కడ టీడీపీ తరఫున పోటీలోని టీజీ అంటే ఆ రెండు కుటుంబాలకు సరిపడని పరిస్థితి. టీజీ ఓటమే ధ్యేయంగా కులమతాలను రెచ్చగొడుతూ ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులతోనే నామినేషన్లు వేయించడం గమనార్హం. గొడవలు చెలరేగిన వెంటనే ఇరు వర్గాలను పిలిపించుకుని ఓట్లను చీల్చేలా పథకం రచించినట్లు చర్చ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఓ వర్గం ఓట్లను చీల్చేందుకూ కుట్ర చేసినట్లు సమాచారం. -
గేట్ల వద్ద నిరీక్షణకు చెక్ పెడతాం
కర్నూలు(రాజ్‌విహార్),న్యూస్‌లైన్: నగరంలోని రైల్వే గేట్ల వద్ద నిరీక్షణ కష్టాలు త్వరలోనే దూరం కానున్నాయని రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. వీటితోపాటు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నగరంలోని కోట్ల రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన ఫుల్ బేస్ ప్లాట్‌ఫాం, అధికారుల గదిని ఆయన శనివారం ప్రారంభించారు. గుత్తిరోడ్డులోని రైల్వేగేటు వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జీ (ఆర్ఓబీ), కృష్ణానగర్ గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గాయత్రి ఎస్టేట్ పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, డీసీసీ అధ్యక్షులు బీ.వై. రామయ్య, పార్టీ నాయకులు బుచ్చిబాబు తమ ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలింపించాలంటూ ప్రజలను కోరుతూ అధికారిక కార్యక్రమాన్ని కాస్త రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అనంతరం మంత్రి కోట్ల మాట్లాడుతూ తాన బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్నూలుతోపాటు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్ల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. కోట్లా హాల్ట్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని చెప్పిన మంత్రి.. మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి హైదరాబదు డివిజన్‌కు లక్ష రూపాయల అవార్డు ప్రకటించారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం.. కాటసాని రాష్ట్రాన్ని విభజించి సోనియా గాంధీ సీమాంధ్రులకు తీరని అన్యాయం చేశారని, ఈ కారణంగా ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నామని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. 30 ఏళ్లపాటు పార్టీలోనే ఉండి ప్రజలకు సేవ చేసినా ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందారు. కార్యక్రమంలో రైల్వే ఏజీఎం సునిల్ అగర్వాల్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్యా, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మూర్తి, రైల్వే డివిజినల్ మేనేజరు రాకేష్ అరోన్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారుల పాల్గొన్నారు. -
కూత పెట్టని హామీలు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రైల్వే ఓటాన్ బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశపర్చింది. ఆ శాఖ సహాయ మంత్రిగా జిల్లాకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని ఆ శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించినా జిల్లాకు ఒరిగింది శూన్యం. ఇక కొత్త ప్రాజెక్టుల ఊసే కరువైంది. మంత్రి కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రైల్వే వర్క్‌షాప్‌నకు సైతం ప్రాధాన్యత లభించలేదు. దశాబ్దాల డిమాండ్ అయిన మంత్రాలయం రైలు మార్గానికీ గ్రహణం వీడని పరిస్థితి. ఒకటి రెండు రైళ్లు మినహా బడ్జెట్ పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ఈ విషయంలో మంత్రి కోట్ల అసమర్థత ప్రజాగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రూ.2వేల కోట్లు అవసరం కాగా.. ప్రకటనలే తప్ప నిధుల కేటాయింపుపై స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. వీటి మాటేమి... కర్నూలులో రైల్వే వర్క్‌షాప్ ఏర్పాటుకు గత ఏడాది బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్థల సేకరణకు హడావుడి చేశారు. నగర శివారులోని పంచలింగాల వద్ద స్థలాన్ని పరిశీలించినా సేకరణ చేపట్టలేకపోయారు. ఇందుకు రూ.203 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్లో మొండిచేయి చూపారు. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్(నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోట్ల హామీ ఇచ్చారు. ఇందుకు రూ.2కోట్లు అవసరం కాగా కేటాయింపులు చేపట్టలేదు. మంత్రాలయం నుంచి కర్నూలుకు కొత్త లైన్ సర్వే పనులకు మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండుసార్లు సర్వే చేసి నిధుల దుర్వినియోగం చేశారే తప్ప.. ఈసారీ లైను ఊసెత్తలేదు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్‌ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం.. ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దే పనులను పూర్తిగా విస్మరించారు. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సహా అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్లో ఆపాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. హొస్పేట్-మంత్రాలయం-కర్నూలు-శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామన్న కోట్ల హామీ నీరుగారింది. ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనులకు, గుంటూరు-గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు మరిచారు. కాచిగూడ-బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మళ్లీ మొండిచేయి
రాజంపేట, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. మాటలను కోటలు దాటించే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి హామీలు నీటిమూటలే అయ్యాయి. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాయలసీమ నుంచి ప్రాతనిథ్యం వహిస్తుండటంతో బడ్జెట్ విషయంలో జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. రైల్వేశాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే గందరగోళం మధ్య బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు కనీస న్యాయం జరగలేదు. కాచిగూడ- తిరుపతి డబుల్‌డెక్కర్ రైలును బైవీక్లీగా జిల్లా మీదుగా నడిపించనున్నారు. అలాగే కాచిగూడ-నాగర్‌కోయిల్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్, ముంబై-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ జిల్లా మీదుగా నడవనున్నది. బడ్జెట్లో నందలూరు రైల్వేపరిశ్రమ ఊసేఎత్తలేదు. కొత్త మార్గాల గురించి కానీ.. ప్రతిపాదనలో ఉన్న పొడిగింపు రైళ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. కాచిగూడ- మంగళూరు, చెన్నై-నాగర్సోల్, బనగానపల్లె-ఎర్రగుంట్ల రైళ్లు బడ్జెట్ కాగితాల్లోనే ఉండిపోయాయి. కడప-బెంగళూరు, కృష్ణపట్నం-ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గాలకు మళ్లీ అరకొర నిధులే కేటాయించారు. దీంతో ఈ రైలు మార్గాల నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతునే ఉంది. -
కోట్లు తెచ్చేనా?
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విషయంలో జిల్లా వాసులు ఆ శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2012 అక్టోబరు 28 నుంచి కోట్ల మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఒకటీ రెండు తప్ప జిల్లాకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనైనా కనీసం రూ.2వేల కోట్లు కేటాయిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన ్న అభిప్రాయం ఉంది. హామీలు.. ప్రతిపాదనలు.. కర్నూలులో రైల్వే వర్క్‌షాపు ఏర్పాటును గత ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించారు. స్థల సేకరణకు పరిశీలన తప్ప ఎక్కడన్నది ఖరారు కాలేదు. ఇందుకు రూ.150 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. దూపాడు వద్ద రూ.2 కోట్లతో ట్రైన్ మెయింటెన్స్ (నిర్వాహణ) షెడ్ ఏర్పాటుకు మంత్రి హామీ మంత్రాలయం నుంచి కర్నూలు వరకు రైల్వేలైన్ నిర్మాణానిన 44 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. 2004లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించి సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించారు. 2011 డిసెంబర్లో రీ సర్వే చేసి నివేదికలు సమర్పించారు. 110 కిలో మీటర్ల లైన్‌కు రూ.1100 కోట్లు ఖర్చవుతుందని అంచన. గుత్తి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాదు వరకు డబుల్ లైన్, విద్యుదీకరణ పనులు తిరుపతి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాదు డబుల్‌డెక్కర్ రైలు కర్నూలు ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తిస్థాయి షెడ్ నిర్మాణం.. రూ.2కోట్లు కావాలని అంచన. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌తో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లకు కర్నూలులో స్టాపింగ్ హోస్పెట్ - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు ఎర్రగుంట్ల - నంద్యాల లైను పెండింగ్ పనులకు రూ.200కోట్లు అవసరం గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలో మీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు రాలేదు బెంగళూరు వరకు గరీబ్థ్ ్రఏర్పాటు ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి కోట్ల హామీ విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. డోన్‌కు న్యాయం జరిగేనా? డోన్, న్యూస్‌లైన్: డోన్‌ను మోడల్‌రైల్వేస్టేషన్‌గా మార్చినా ప్రజలకు అనువైన రైళ్లు లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే డోన్‌కు ఈసారి ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో న్యాయం జరగుతుందని జనం అశ పెట్టుకున్నారు. ముఖ్యంగా డోన్- గుంటూరు, గుంతకల్-సికింద్రాబాద్ బ్రాడ్‌గేజ్ లైన్లను డబుల్‌లైన్లుగా మార్చడంలో సర్వేలకే పరిమితమైంది. డోన్-బళ్లారి, డోన్-గుంటూరు, డోన్-సికింద్రాబాద్ డబుల్ లైన్లు మార్చే విషయం అలాగే ఉండిపోయింది. మచిలీపట్నం- ముంబై రైలును రెండేళ్ల క్రితం బడ్జెట్లో ప్రకటించినా అతీగతీ లేదు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్ వరకు, అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను హౌరా వరకు, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ డోన్ వరకు పొడిగింపు ప్రతిపాదనకు మోక్షం లేదు. మచిలిపట్నం-బెంగళూరు మధ్య వారానికి మూడురోజులు నడిచే మచిలిపట్నం ఎక్స్‌ప్రెస్, తిరుపతి-నిజాముద్దిన్ మధ్య నడిచే ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ డైలీ నడపాలనే ప్రతిపాదనకు మోక్షం లేదు. డోన్-పెండేక ల్ మధ్య డబుల్‌లైన్, పాణ్యం సమీపంలోని కృష్ణమ్మకోన రైల్వేస్టేషన్లో డబుల్‌లైన్ ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలి. డోన్ రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్‌ను 8గంటల నుంచి 12గంటలు పొడిగించాల్సి ఉంది. ఈ ఏడాదైనా కూత కూసేనా? కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా భోజనానికి ఇబ్బంది ఉండదని చెబుతారు. అయితే నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేలైన్ విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కర్నూలు ఎంపీ కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ రైల్వే లైన్ పనులు పరుగు పెడతాయని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. పస్తుతం ఈ లైన్‌కు సంబంధించిన పనులు ఏడాదిగా అంగుళం కూడా ముందుకు సాగకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో నేడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జనం అశలు పెట్టుకున్నారు. గత ఏడాది బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయించిన రైల్వే మంత్రి బనగానపల్లె వరకు రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నుంచి నంద్యాల సమీపంలోని 20 కి.మీ. వరకు 123 కిలో మీటర్లున్న ఈ లైన్లో ఇప్పటి వరకు 90 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం పూర్తయింది. సంజామల మండలం నొస్సం వరకు రైల్వే ట్రాక్, స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణ పనులు మూడేళ్ల క్రితమే పూర్తయ్యాయి. అక్కడి బనగానపలె ్ల దాటే వరకు ట్రాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఫేస్-1లో సంజామల మండలం నొస్సం వరకు, ఫేస్ -2లో అక్కడి నుంచి అమడాల మెట్ట, బనగానపల్లె వరకు రెండేళ్ల క్రితమే ట్రయల్న్ ్రనిర్వహించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె స్టేషన్ల నిర్మాణాలు, ఆ స్టేషన్ల పరిధిలో పట్టాల క్రాసింగ్, సిగ్నల్స్ తదితర పనులకు సబంధించి నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. బనగానపల్లె నుంచి నంద్యాల వరకు ట్రాక్, వంతెనలు, క్రాసింగ్స్ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. రూ. 100 నుంచి రూ. 150 కోట్లు కేటాయిస్తే తప్ప పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. నేటి ఓటాన్ అకౌంట్లో ఈ మేరకు నిధుల కేటాయింపుపై జనం ఆశలు పెట్టుకున్నారు. -
దద్దమ్మలు వీళ్లు
సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దద్దమ్మలుగా మారిపోయారని ఏపీ ఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఫొటోలున్న ఫ్లెక్సీలను శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సోనియాగాంధీతో పాటు మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, చిందంబరం, షిండే, జైరాం రమేష్ తదితరుల ఫొటోలు కల్గిన ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. విభజనను అడ్డుకునేందుకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఉద్యోగులు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసేందుకు జాక్టో ముందుకు వచ్చి కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై చర్చించాయి. ఆదివారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చే సేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా 9వ తే దీన నల్ల బ్యాడ్జీలతో నిరసన, 10వ తేదీ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ర్యాలీలు, 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో జాక్టో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరోసారి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలగకుండా, ఉద్యమ తీవ్రత తగ్గకుండా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆందోళనలో భాగంగా మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయంలో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చే శారు. జీతాలు రాకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఉద్యోగులు రెండు నెలలకుపైగా ఉద్యమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని విమర్శించారు. హిందూపురంలో ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్జీఓలు విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను తగులబెట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. మడకశిర , పెనుకొండ, గోరంట్లలో ఆందోళనలు చేపట్టారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ 160వ రోజూ దీక్ష కొనసాగించారు. -
నువ్వా....నేనా? ....రచ్చ
జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న కేంద్ర రైల్యే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైంది. వీరిద్దరి మధ్య రచ్చ ముదిరి పాకాన పడింది. నువ్వా.. నేనా? అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలిద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలతో శ్రేణుల్లో కలకలం రేగుతోంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే వీరిద్దరు రచ్చకెక్కారనే చర్చ జరుగుతోంది. శనివారం ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా మంత్రి కోట్ల టీజీనుద్దేశించి మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌లో ఉంటూ మంత్రి పదవులు అనుభవిస్తూ పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్న వారు బయటకు వెళ్లిపోవాలని’ విమర్శించారు. ఆ తర్వాత 24 గంటలు గడవక మునుపే మంత్రి టీజీ సైతం అదే రీతిలో మంత్రి కోట్లపై ఘాటైన విమర్శలు చేశారు. ఆదివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లకు ఆహ్వానం అందకపోగా.. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు పాల్గొనడం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. పార్టీలు మారడం ఆయనకే చెల్లు పార్టీలు మారడం మంత్రి టీజీకి కొత్తేమీ కాదని.. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు చుట్టేసి వచ్చారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీది కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎలాగూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని.. ఎంత త్వరగా బయటకు వెళితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని.. రాజకీయాల్లోనూ ఎదుగుదల సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపనలు చేయాలే కానీ.. జిల్లా కేంద్రంలో ఉండి వ్యవహారం నడిపితే ఎలాగని ప్రశ్నించారు. ఆ పనులన్నింటికీ తాను ఆయా ప్రాంతాలకు వెళ్లి తిరిగి శంకుస్థాపన చేస్తానన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండగా.. టీజీ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. 2004లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తానే తగుటబెట్టినట్లు ఆరోపించడం సత్యదూరమన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పొరపాటును తనకు అంటగట్టడం సరికాదన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని.. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి టీజీ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్న విషయమై విలేకరులు ప్రశ్నించగా.. అది కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చూసుకుంటారని దాటవేశారు. విభజన వల్ల ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చునని, 2019లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కార్యాలయాన్నే తగులబెట్టించావు ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. -
కార్యాలయాన్నే తగులబెట్టించావు
ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. -
పార్టీలు మారడం ఆయనకే చెల్లు
పార్టీలు మారడం మంత్రి టీజీకి కొత్తేమీ కాదని.. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు చుట్టేసి వచ్చారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీది కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎలాగూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని.. ఎంత త్వరగా బయటకు వెళితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని.. రాజకీయాల్లోనూ ఎదుగుదల సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపనలు చేయాలే కానీ.. జిల్లా కేంద్రంలో ఉండి వ్యవహారం నడిపితే ఎలాగని ప్రశ్నించారు. ఆ పనులన్నింటికీ తాను ఆయా ప్రాంతాలకు వెళ్లి తిరిగి శంకుస్థాపన చేస్తానన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండగా.. టీజీ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. 2004లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తానే తగుటబెట్టినట్లు ఆరోపించడం సత్యదూరమన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పొరపాటును తనకు అంటగట్టడం సరికాదన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని.. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి టీజీ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్న విషయమై విలేకరులు ప్రశ్నించగా.. అది కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చూసుకుంటారని దాటవేశారు. విభజన వల్ల ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చునని, 2019లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.