‘రాష్ట్రాన్ని విడిచి వెళ్తా.. రాజకీయాలు వదిలేస్తారా!’ | Vizag: Surya Prakash Reddy Slams Bandaru Satyanarayana | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రాన్ని విడిచి వెళ్తా.. రాజకీయాలు వదిలేస్తారా!’

Published Wed, Nov 25 2020 2:59 PM | Last Updated on Wed, Nov 25 2020 4:00 PM

Vizag: Surya Prakash Reddy Slams Bandaru Satyanarayana - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మతి భ్రమించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తను తీసుకున్న ఫోటోలు మాజీ మంత్రి దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఒక ఘటనలో భూ ఆక్రమణకు యత్నించిన సూర్య ప్రకాశ్ రెడ్డి.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బండారుపై విరుచుకుపడ్డారు నిజానికి తాను ప్రజా సంకల్ప యాత్రలో కార్యకర్తగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో ఫోటో దిగినట్లు స్పష్టం చేశారు. తనకు భూ ఆక్రమణలతో సంబంధం ఉందని నిరూపిస్తే రాష్ట్రాన్ని విడిచి వెళ్తానని సూర్యప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. నిరూపించలేని పక్షంలో బండారు సత్యనారాయణమూర్తి, అతని తనయుడు రాజకీయాలు విడిచి వెళ్తారా అని ప్రశ్నించారు. చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖ కన్నడ నటుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement