కోట్లు తెచ్చేనా? | suryaprakash reddy central minister dealing railway budget | Sakshi
Sakshi News home page

కోట్లు తెచ్చేనా?

Published Wed, Feb 12 2014 3:12 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

suryaprakash reddy central minister dealing railway budget

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్:  కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో  ప్రవేశపెట్టే రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విషయంలో జిల్లా వాసులు ఆ శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2012 అక్టోబరు 28 నుంచి కోట్ల మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఒకటీ  రెండు తప్ప జిల్లాకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనైనా కనీసం రూ.2వేల కోట్లు కేటాయిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన ్న అభిప్రాయం ఉంది.
 
 హామీలు.. ప్రతిపాదనలు..
 కర్నూలులో రైల్వే వర్క్‌షాపు ఏర్పాటును గత  ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించారు. స్థల సేకరణకు పరిశీలన తప్ప ఎక్కడన్నది ఖరారు కాలేదు. ఇందుకు రూ.150 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు.
 
  దూపాడు వద్ద రూ.2 కోట్లతో ట్రైన్ మెయింటెన్స్ (నిర్వాహణ) షెడ్ ఏర్పాటుకు మంత్రి హామీ
 మంత్రాలయం నుంచి కర్నూలు వరకు రైల్వేలైన్ నిర్మాణానిన 44 ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. 2004లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.165 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించి సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించారు.
 
 2011 డిసెంబర్‌లో రీ సర్వే చేసి నివేదికలు సమర్పించారు. 110 కిలో మీటర్ల లైన్‌కు రూ.1100 కోట్లు ఖర్చవుతుందని అంచన. గుత్తి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాదు వరకు డబుల్ లైన్, విద్యుదీకరణ పనులు తిరుపతి నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రబాదు డబుల్‌డెక్కర్ రైలు  కర్నూలు ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తిస్థాయి షెడ్ నిర్మాణం.. రూ.2కోట్లు కావాలని అంచన.
 
  కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌తో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లకు కర్నూలులో స్టాపింగ్ హోస్పెట్ - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు ఎర్రగుంట్ల - నంద్యాల లైను పెండింగ్ పనులకు రూ.200కోట్లు అవసరం
 గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలో మీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా నిధులు రాలేదు బెంగళూరు వరకు గరీబ్థ్ ్రఏర్పాటు ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి కోట్ల హామీ విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.
 
  డోన్‌కు న్యాయం జరిగేనా?
 డోన్, న్యూస్‌లైన్: డోన్‌ను మోడల్‌రైల్వేస్టేషన్‌గా మార్చినా ప్రజలకు అనువైన రైళ్లు లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  అయితే డోన్‌కు ఈసారి ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో న్యాయం జరగుతుందని జనం అశ పెట్టుకున్నారు. ముఖ్యంగా డోన్- గుంటూరు, గుంతకల్-సికింద్రాబాద్ బ్రాడ్‌గేజ్ లైన్లను డబుల్‌లైన్లుగా మార్చడంలో సర్వేలకే పరిమితమైంది. డోన్-బళ్లారి, డోన్-గుంటూరు, డోన్-సికింద్రాబాద్ డబుల్ లైన్‌లు మార్చే విషయం అలాగే ఉండిపోయింది.

మచిలీపట్నం- ముంబై రైలును రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో ప్రకటించినా అతీగతీ లేదు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్ వరకు, అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను హౌరా వరకు, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ డోన్ వరకు పొడిగింపు ప్రతిపాదనకు మోక్షం లేదు. మచిలిపట్నం-బెంగళూరు మధ్య వారానికి మూడురోజులు నడిచే మచిలిపట్నం ఎక్స్‌ప్రెస్, తిరుపతి-నిజాముద్దిన్ మధ్య నడిచే ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ డైలీ నడపాలనే ప్రతిపాదనకు మోక్షం లేదు. డోన్-పెండేక ల్  మధ్య డబుల్‌లైన్, పాణ్యం సమీపంలోని కృష్ణమ్మకోన రైల్వేస్టేషన్‌లో డబుల్‌లైన్ ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలి.  డోన్ రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్‌ను 8గంటల నుంచి 12గంటలు పొడిగించాల్సి ఉంది.
 
  ఈ ఏడాదైనా కూత కూసేనా?
 కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా భోజనానికి ఇబ్బంది ఉండదని చెబుతారు. అయితే నంద్యాల  - ఎర్రగుంట్ల రైల్వేలైన్ విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కర్నూలు ఎంపీ కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ రైల్వే లైన్ పనులు పరుగు పెడతాయని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు.
 
 పస్తుతం ఈ లైన్‌కు సంబంధించిన పనులు ఏడాదిగా అంగుళం కూడా ముందుకు సాగకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో నేడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జనం అశలు పెట్టుకున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించిన రైల్వే మంత్రి బనగానపల్లె వరకు రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం.  వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నుంచి నంద్యాల సమీపంలోని 20 కి.మీ. వరకు 123 కిలో మీటర్లున్న ఈ లైన్‌లో ఇప్పటి వరకు 90 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం పూర్తయింది. సంజామల మండలం నొస్సం వరకు రైల్వే ట్రాక్, స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణ పనులు మూడేళ్ల క్రితమే పూర్తయ్యాయి. అక్కడి బనగానపలె ్ల దాటే వరకు ట్రాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది.
 
 ఫేస్-1లో సంజామల మండలం నొస్సం వరకు, ఫేస్ -2లో అక్కడి నుంచి అమడాల మెట్ట, బనగానపల్లె వరకు రెండేళ్ల క్రితమే  ట్రయల్న్ ్రనిర్వహించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె స్టేషన్ల నిర్మాణాలు, ఆ స్టేషన్ల పరిధిలో పట్టాల క్రాసింగ్, సిగ్నల్స్ తదితర పనులకు సబంధించి నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. బనగానపల్లె నుంచి నంద్యాల వరకు ట్రాక్, వంతెనలు, క్రాసింగ్స్ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. రూ. 100 నుంచి రూ. 150 కోట్లు కేటాయిస్తే తప్ప పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. నేటి ఓటాన్ అకౌంట్‌లో ఈ మేరకు నిధుల కేటాయింపుపై జనం ఆశలు పెట్టుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement