
రామయ్యను దర్శించుకున్న డాక్టర్ కృష్ణమూర్తి
భద్రాచలం : శ్రీ సీతారామచంద్రస్వామి వారిని హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఎస్‌సీ అండ్ ఇస్రో డైరెక్టర్ డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ప్రాంగణంలోని లక్ష్మీ తాయారమ్మ, అభయాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.