
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఎప్పటికైనా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ నిర్ణయమేదో ఇప్పుడే తీసుకోవాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరింత ఉత్సాహంగా పని చేస్తారని పేర్కొన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారం నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో కొద్దిగా అసంతృప్తితో ఉన్నా, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మేలు జరుగుతుందని విన్నవించారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు దూరం పెరగకుండా సీఎం జోక్యం చేసుకొని త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరారు. పీఆర్‌సీ అమలు, ఐఆర్ వంటి అంశాలను త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల విభజన, కొత్త పోస్టుల మంజూరు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment