ఘనంగా జగదీశ్‌రెడ్డి జన్మదినం  | Jagadeesh Reddy Birthday Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా జగదీశ్‌రెడ్డి జన్మదినం 

Published Thu, Jul 19 2018 2:31 PM | Last Updated on Thu, Jul 19 2018 2:31 PM

Jagadeesh Reddy Birthday Celebrations - Sakshi

మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, చిత్రంలో నేతి

భువనగిరి : రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణరెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లి నుంచి  ఉదయం 11 గంటలకు భువనగిరికి చేరుకున్న మంత్రికి ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ నివాసానికి చేరుకుని కేక్‌ కట్‌ చేశారు.అనంతరం స్వీట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంతికి భారీ పూల మాల వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రికి ఎడ్ల బండిని బహుకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కలెక్టర్‌ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొలపుల అమరేందర్, తెలంగాణ జాగృతి నాయకులు రాజీవ్‌సాగర్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతులు నాయక్, ఎంపీపీ వెంకటేశం, టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ అధ్యక్షులు గోమారి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, జనగాం పాండు, సిద్దుల పద్మ, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 

బాణా సంచాల మధ్యలో..

స్థానిక నాయకులు మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక బాబూ జగ్జీవన్‌రావ్‌ చౌరస్తా మరియు ఎమ్మెల్సీ నివాసం సమీపంలో సుమారు 30 నిమిషాల పాటు బాణాసంచాలను కాల్చారు. అదే విధంగా బ్యాండ్‌ మేళాల మధ్య వేడుకలను నిర్వహించారు. 

మంత్రిని కలిసిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి

మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement